అక్షర వలయం

ఇచ్చిన ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను పూరించండి. అన్నీ ‘ స’తో మొదలయ్యే పదాలే వస్తాయి.

Published : 23 Feb 2022 00:18 IST

ఇచ్చిన ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను పూరించండి. అన్నీ ‘ స’తో మొదలయ్యే పదాలే వస్తాయి.

1. సరాసరి  2. లోపల ఆలూ దాగిన స్నాక్‌
3. తెలుగు నేచురల్‌    
4. కాలమే కానీ మరోలా..
5. అంతా నీవే.. 6. ముగిసింది
7. ఇంకా ఉంది 8. ఓ అమ్మాయి పేరు  


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని క్రీడల పేర్లు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టగలరా?

ఫుట్‌బాల్‌, రగ్బీ, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌


నేనెవర్ని?

1. నేను ఏడు అక్షరాల సమూహాన్ని. సంగీత సాధకులకు తొలిపాఠాన్ని. ఇంతకీ నేను ఎవరు?

2. గది మొత్తం తిరుగుతాను కానీ చీపురు కట్టను కాదు. కంటికి కనిపిస్తాను కానీ ముక్కుకి తప్ప చేతికి మాత్రం చిక్కను. ఇంతకీ నేను ఎవరిని?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


క్విజ్‌.. క్విజ్‌..!

1. ఒలింపిక్‌ క్రీడల లోగోలో ఎన్ని రింగులు ఉంటాయి?
2. ఏ గ్రహం తన కక్ష్యలో అత్యంత వేగంగా తిరుగుతుంటుంది?
3. ‘వింబుల్డన్‌’ పదం ఏ ఆటకు సంబంధించినది?

4. సముద్ర జీవి షార్క్‌ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి?
5. అంతరిక్షంలో ఎటువంటి శబ్దాలు వినిపిస్తాయి?
6. ఏ రక్తకణాలు మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌తో పోరాడతాయి?


జత చేయండి

ఇక్కడ ఒక వరసలో పండ్లూ కూరగాయలూ, మరో వరసలో వాటి రంగులు ఉన్నాయి. సరైన జతను గుర్తించండి చూద్దాం.


కలపగలరా?

ఇక్కడ మూడు అక్షరాల సమూహాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మూడింటిని కలిపితే ఓ అర్థవంతమైన పదం వస్తుంది. అలాంటివి మొత్తం ఆరు వస్తాయి. అవేంటో కనిపెట్టగలరా?


నేను గీసిన బొమ్మ!


జవాబులు

అక్షర వలయం : 1.సగటు 2.సమోసా 3.సహజం 4.సమయం 5.సర్వస్వం 6.సమాప్తం 7.సశేషం 8.సరళ

ఆ ఒక్కటి ఏది : రగ్బీ
నేనెవర్ని : 1.సరిగమపదని 2.పొగ
కవలలేవి : 2, 3
క్విజ్‌.. క్విజ్‌ : 1.అయిదు 2.బృహస్పతి 3.టెన్నిస్‌ 4.సున్నా 5.ఏ శబ్దమూ వినిపించదు 6.తెల్ల రక్తకణాలు
జత చేయండి : 1-ఇ, 2-ఎఫ్‌, 3-ఎ, 4-బి, 5-డి, 6-సి
కలపగలరా : 1.STUPIDITY, 2.BIOGRAPHY, 3.CANDIDATE, 4.THEREFORE, 5.ARCHITECT, 6.CARPENTRY


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని