పువ్వు తెచ్చే పుష్కరం!

హాయ్‌ ఫ్రెండ్స్‌... మీకు నదికి పుష్కరాలు వస్తాయని తెలుసు కదా! అది కూడా 12 సంవత్సరాలకొక్కసారి వస్తాయి. కానీ ఓ పువ్వు వల్ల కూడా పుష్కరాలు వస్తాయి తెలుసా! 12 సంవత్సరాలకోసారి వచ్చే ఆ పుష్కరాన్ని చూడ్డానికి పెద్ద ఎత్తున ప్రకృతి ప్రేమికులు తరలివస్తారు

Published : 07 Mar 2022 01:11 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... మీకు నదికి పుష్కరాలు వస్తాయని తెలుసు కదా! అది కూడా 12 సంవత్సరాలకొక్కసారి వస్తాయి. కానీ ఓ పువ్వు వల్ల కూడా పుష్కరాలు వస్తాయి తెలుసా! 12 సంవత్సరాలకోసారి వచ్చే ఆ పుష్కరాన్ని చూడ్డానికి పెద్ద ఎత్తున ప్రకృతి ప్రేమికులు తరలివస్తారు. ఇంతకీ ఏంటా పువ్వు? అసలింతకీ ఏంటా పుష్కరం? తెలుసుకుందామా! ఆలస్యమెందుకు చదివేయండి మరి.

నగనగా ఓ అందమైన పువ్వు. అది చాలా అరుదైన పువ్వు. అది కేవలం 12 సంవత్సరాలకొక్కసారి మాత్రమే పుష్పిస్తుంది. అప్పుడిక జాతరే! చుట్టుపక్కల కొండలన్నీ రంగుల తివాచీ కప్పుకున్నట్లు తయారవుతాయి. కనుచూపుమేరంతా నీలి, ఊదారంగులే కనిపించి కనువిందు చేస్తాయి. ఇదంతా ఏ యూరప్‌ ఖండంలోనో, అగ్రరాజ్యం అమెరికాలోనో, వింతల పుట్టిల్లైన ఆఫ్రికాలోనో కాదు. ఈ విచిత్రం చోటుచేసుకునేది అక్షరాలా మన దేశంలోనే!

అత్యంత అరుదు..

ఈ పువ్వు పేరు నీలకురంజి. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన పుష్పం. ఎక్కువగా కేరళలోని కొండల్లో ఈ నీలకురంజి మొక్కలున్నాయి. తమిళనాడులోనూ పశ్చిమ కనుమల్లోని కొండప్రాంతాల్లో ఇవి కొంత మేర పెరుగుతాయి. కేవలం కేరళ, తమిళనాడే కాదు.. కర్ణాటకలోనూ అక్కడక్కడ ఈ నీలకురంజి మొక్కలున్నాయి. వీటిలో దాదాపు 45 రకాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటిలో కొన్ని రకాలు ఆరు, తొమ్మిది సంవత్సరాలకోసారి కూడా పుష్పిస్తాయట.

గత ఏడు విరబూసినా...

ఈ మొక్కలు గత ఏడు విరబూశాయి. ప్చ్‌...! కానీ కొవిడ్‌ ఆంక్షల కారణంగా పర్యాటకులను స్థానిక ప్రభుత్వాలు ఈ ప్రకృతి వింతను వీక్షించేందుకు అనుమతించలేదు. మళ్లీ ఈ పుష్పాలను ప్రత్యక్షంగా వీక్షించాలంటే 2033 వరకు ఎదురు చూడాల్సిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని