క్విజ్‌.. క్విజ్‌...!

అంతరిక్షంలో పండించిన మొట్టమొదటి కూరగాయ ఏంటి?

Updated : 10 Mar 2022 02:26 IST

1. అంతరిక్షంలో పండించిన మొట్టమొదటి కూరగాయ ఏంటి?
2. చంద్రుడి మీద ఆడిన ఏకైక క్రీడ ఏది?
3. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన వాళ్లలో పొడవైన వారు ఎవరు?

4. వానపాముకు ఎన్ని గుండెలుంటాయి?

5. జెల్లీఫిష్‌లో ఎంతశాతం నీరు ఉంటుంది?
6. ఏ జీవి చెమట గులాబీరంగులో ఉంటుంది?

 


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


కనుక్కోండి చూద్దాం!

ఆధారాల సాయంతో ఖాళీ గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


తమాషా.. తమాషా..!

అక్షరాల ఆధారంగా బొమ్మల పేర్లను గడుల్లో నింపగలరా?


పండు.. పండు..!

ఇక్కడున్న వాక్యాల్లో పండ్ల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా చదివి కనుక్కోండి చూద్దాం.

1. రుద్రా..! క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరాలి నువ్వు.
2. మా పింకీకి బస్సులో అర టికెట్టు తీసుకుంటే సరిపోతుంది.  
3. రోజా.. మన ఇంటికి వెళదాం పద.
4. మావారే.. గుడిలో అన్నదానం చేయించారు.  
5. మామా.. మిడిసిపడకు అంతలా.. సరేనా!


ముచ్చటగా మూడు!

ఈ చిత్రంలో మూడు పదాలు దాగున్నాయి. ప్రతి వృత్తంలోని అక్షరాలను సరైన క్రమంలో అమరుస్తూ.. ఆ మూడు పదాలేంటో కనిపెట్టండి.


చెప్పగలరా!

1. నీటి మీద తేలుతుంది కానీ పడవకాదు. చెప్పాపెట్టకుండా పోతుంది కానీ జీవి కాదు. మనల్ని మనకు చూపిస్తుంది కానీ అద్దం కాదు. మెరుస్తుంది కానీ మెరుపు కాదు. ఇంతకీ అదేంటో చెప్పుకోండి చూద్దాం.
2. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు. ఇంతకీ ఏంటది?



నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..!: 1.బంగాళాదుంప 2.గోల్ఫ్‌ 3.అబ్రహం లింకన్‌ 4.అయిదు 5.దాదాపు 95 శాతం 6.హిప్పోపొటమస్‌
ఏది భిన్నం: 3
కనుక్కోండి చూద్దాం: 1.గాలి 2.గాయం 3.గానం 4.గాత్రం 5.గాలం
తమాషా.. తమాషా!: 1.సముద్రం 2.మునీశ్వరుడు 3.రుధిరం 4.రంపం 5.పంజరం
పండు.. పండు!: 1.ద్రాక్ష 2.అరటి 3.జామ 4.రేగు 5.మామిడి
ముచ్చటగా మూడు!: baseball, champion, decision
చెప్పగలరా!: 1.సబ్బు నీటిబుడగ 2.నత్త


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని