ఈ రోజు ప్ర‘జల’ దినోత్సవం!
జలం మన బలం.. జలం మన గళం.. మొత్తానికి నీరు ప్రాణాధారం. జలం లేకుంటే జీవం లేదు. అంతటి ప్రాముఖ్యముంది నీటికి. ఇప్పుడిదంతా ఎందుకు అంటే ఈ రోజు ‘ప్రపంచ జల దినోత్సవం’ (వరల్డ్ వాటర్ డే). 1993 నుంచి ఏటా మార్చి 22న ఈ దినోత్సవం జరుపుకుంటున్నా. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ నీటి లభ్యత ప్రపంచవ్యాప్తంగా ఒకేలా లేదు. చాలా చోట్ల కనీసం తాగడానికి కూడా నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. మరి కొన్ని చోట్ల విపరీతంగా వృథా చేస్తున్నారు. అందుకే రోజురోజుకూ భూగర్భ జలమట్టాలు పడిపో తున్నాయి. ఫ్రెండ్స్.. ఈ రోజు నుంచి నీటిని పొదుపుగా వాడి, వృథాను అరి కట్టడానికి మనవంతుగా కృషి చేద్దామా మరి.
* మన ఇంట్లో ట్యాప్‌లను వాడిన తర్వాత పక్కాగా ఆపేయాలి.
* అంతే కాదు మనం స్కూలుకు వెళుతున్నప్పుడు ఎక్కడైనా వీధి కుళాయిల నుంచి నీరు వృథాగాపోతుంటే మనవంతు బాధ్యతగా వాటిని కట్టేయాలి.
* స్కూళ్లోనూ నీరు వృథా కాకుండా చూసుకోవాలి. వాష్‌రూముల్లో కుళాయిలు వాడిన తర్వాత వాటిని కచ్చితంగా ఆపేయాలి.
* మన సైకిళ్లు, అమ్మానాన్న కార్లు, బైక్‌లు, స్కూటీలను తరుచుగా నీటితో కడగటం తగ్గించాలి. దానికి బదులు తడివస్త్రంతో తుడుచుకోవాలి. దీనివల్ల చాలా నీరు ఆదా అవుతుంది.
* ఇల్లు, వాకిళ్లను కడగడం కోసం లీటర్లకు లీటర్లు నీటిని వృథా చేయొద్దు. దుస్తులు ఉతికేటప్పుడు, పాత్రలు శుభ్రం చేసేటప్పుడు. ఇలా మన నిత్యజీవితంలో నీటి పొదుపును పాటించాలి. దీనికి అమ్మానాన్న సహకారమూ అవసరం. మరింకేం ఈ రోజు నుంచే జలసంరక్షణ ప్రారంభించేయండి. ఈ విషయాన్ని స్కూళ్లోనూ చెప్పండి. ఉపాధ్యాయులు అభినందిస్తారు. వారు మరిన్ని సలహాలు, సూచనలు ఇస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS Govt: ఆ తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేయండి: హైకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం
-
Movies News
Tamil movies: ఈ ఏడాది ఆసక్తి రేకెత్తిస్తోన్న కోలీవుడ్ చిత్రాలివీ!
-
Sports News
Ashwin: పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలకు అశ్విన్ ఘాటు స్పందన!
-
India News
SC: న్యాయమూర్తిగా ఎల్సీవీ గౌరీ నియామకం సరైందే.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
-
World News
EarthQuake: నిన్నటి నుంచి 100 సార్లు కంపించిన భూమి..!
-
Crime News
Hyderabad: భార్య చూస్తుండగానే భవనం పైనుంచి దూకేసిన భర్త