వాతావరణాన్ని కాపాడుకుందామా!

ప్రకృతి మనకు ఇచ్చిన వరం వాతావరణం. అదే లేకుంటే ఈ భూమి మీద అసలు జీవమే లేదు. అలాంటి వాతావరణం నేడు అతలాకుతలం అవుతోంది. కాలుష్యం, పర్యావరణ మార్పులతో దెబ్బతింటోంది.

Updated : 23 Mar 2022 00:29 IST

ప్రకృతి మనకు ఇచ్చిన వరం వాతావరణం. అదే లేకుంటే ఈ భూమి మీద అసలు జీవమే లేదు. అలాంటి వాతావరణం నేడు అతలాకుతలం అవుతోంది. కాలుష్యం, పర్యావరణ మార్పులతో దెబ్బతింటోంది. దీని మీద అవగాహన కల్పించడానికే ఏటా మార్చి 23న ‘ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ప్రపంచ వాతావరణ శాస్త్ర సంస్థ.. 1950 మార్చి 23న ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఇదే తేదీన ‘ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరానికి గాను ‘ఎర్లీ వార్నింగ్‌- ఎర్లీ యాక్షన్‌’ థీమ్‌తో కార్యాచరణ నిర్వహిస్తున్నారు. త్వరగా గుర్తించడం, త్వరగా చర్య తీసుకోవడం వల్ల పర్యావరణానికి ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవచ్చనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 1950 నుంచే ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఒక్కో థీమ్‌తో జరుపుకోవడం మాత్రం 1961 నుంచి మాత్రమే ప్రారంభమైంది. థీమ్‌ ఏమైనప్పటికీ లక్ష్యం మాత్రం ఒక్కటే.. పర్యావరణాన్ని పరిరక్షించడం. వాతావరణ మార్పుల విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండడం. పచ్చదనం పెంపే చాలా సమస్యలకు పరిష్కారం. అందుకే ఈ రోజు మనమూ మన పెద్దల సహకారంతో తలా ఒక మొక్కను నాటి.. పరిరక్షిద్దామా ఫ్రెండ్స్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని