Published : 24 Mar 2022 01:54 IST

పిల్లల నేస్తం బురియో..!

దాని పేరు బురియో. అదో వీధికుక్క. ఉండేది గుజరాత్‌ రాష్ట్రంలోని కరన్‌నగర్‌లో. ఇది పేరుకే ఊరకుక్క కానీ.. చుట్టుపక్కల వారందరికీ ప్రియనేస్తం. ముఖ్యంగా పిల్లలకు.. ఇదంటే ఎంతో ఇష్టం. దీనికీ పిల్లలంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే అది వాళ్లను ఏమీ చేసేది కాదు. వారు దాన్ని గిల్లినా.. తొక్కినా.. తన్నినా.. చెవులు పట్టుకుని లాగినా.. కళ్లు మూసుకుని, తల వంచుకుని.. తోక ఊపుతూ ఉండిపోయేది. ఇది ఇంత వరకు ఎవరినీ కరిచించి కూడా లేదంట! తమ పిల్లలు దాంతో ఆడుకుంటుంటే తల్లులకు అదో భరోసా. ఎంచక్కా వాళ్లు తమ పనుల్లో నిమగ్నమైపోయేవారు. ఈ బురియో కొత్త వాళ్లతోనూ, తోటి కుక్కలతోనూ ఇలాగే సౌమ్యంగా ఉండేది. కానీ పాపం అది ఈ మధ్యే చనిపోయింది. ఇంత మంచి కుక్క చనిపోతే స్థానికులు ఊరుకుంటారా ఏంటి? లాంఛనంగా దాని అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా సంతాప సభ పెట్టి, దానికి నివాళులర్పించారు. దాని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలూ చేశారు. ‘మంచిగా ఉంటే మనల్నీ మంచిగానే చూస్తారు’ అనడానికి ఈ బురియోనే ఉదాహరణగా నిలుస్తోంది కదా ఫ్రెండ్స్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు