కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 11 Apr 2022 14:46 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేనెవర్ని?

నేనో నాలుగక్షరాల ఆంగ్ల పదాన్ని. 2, 3, 4 అక్షరాలను కలిపితే ‘వాయువు’ అనే అర్థం వస్తుంది. 1, 2, 3 అక్షరాలను కలిపితే ‘పలకరింపు’ వస్తుంది. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


పండ్లే పండ్లు!

ఈ కింది వాక్యాల్లో వస్తువుల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివి అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం.
1.  అరరే.. గులాబీ పువ్వు కాలువలో పడిపోయిందే!
2. అదిగో మన కలప.. నస పెట్టకు నువ్విక!.
3. జానకీ! మా ఇంటికి వీలు చూసుకొని రా ఒకసారి.. సరేనా!
4. రాజా... మనం అనుకున్నట్లే అంతా ప్రశాంతంగా జరిగింది కదా!
5. అదిగో అదే అర..! టిప్పుసుల్తాన్‌ దానిలోనే చురకత్తి పెట్టుకునే వాడట.  
6. ఏంటా నస.. పోటాపోటీగా ఇద్దరూ అరుస్తున్నారేంటి?
7. జానకీ.. నా రుద్రాక్షమాల కనిపించిందా నీకు?
8. ఓ మామా! మిడిసి పడకు నువ్వు...!


తమాషా ప్రశ్నలు

1.  పొద్దున్నే పాలు తాగకుంటే ఏమవుతుంది?
2. గుడ్డు పెట్టే రాయి ఏది?
3. సరిగ్గా ‘ఇండియా’ మధ్యలో ఏముంది?
4. గబగబా ఐస్‌క్రీం తింటే ఏమవుతుంది?







జవాబులు

కవలలేవి?: 1, 4

నేనెవర్ని?: hair

పండ్లే పండ్లు!: 1.రేగు 2.పనస 3.కివీ 4.జామ 5.అరటి 6.సపోటా 7.ద్రాక్ష 8.మామిడి

తమాషా ప్రశ్నలు: 1.మిగిలిపోతాయి 2.పావురాయి 3.‘డి’ అనే అక్షరం  4.అయిపోతుంది

గజిబిజి బిజిగజి: 1.నామకరణం 2.వినీలాకాశం 3.పావురాయి 4.పంచదార 5.మామిడితోట 6.పాలరాయి 7.రామచిలుక 8.పనసకాయ

చెప్పుకోండి చూద్దాం!: 1.క్యాబేజీ 2.చిటికెన వేలు 3.ఆవలింత

రాయగలరా: 1.మరక 2.మరుపు 3.మలుపు 4.మనము 5.మనసు 6.మనిషి 7.మమత 8.మడమ

తప్పులే తప్పులు: 1.విక్రయం 2.వర్షాకాలం 3.వీధినాటకం 4.కథానాయకుడు 5.హరివిల్లు 6.సీతాఫలం 7.రాజధాని 8.నరకప్రాయం 9.అమావాస్య 10.పౌర్ణమి 11.శాతకర్ణి 12.అష్టైశ్వర్యాలు


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని