తమాషా ప్రశ్నలు?

చాలామందికి ఆనందాన్నిచ్చే సిటీ ఏది? సందు కాని సందు?...

Published : 14 Apr 2022 00:51 IST

1. చాలామందికి ఆనందాన్నిచ్చే సిటీ ఏది?
2. సందు కాని సందు?
3. 200 నుంచి 2ను ఎన్నిసార్లు తీసివేయగలరు?


రెండే రెండు!

ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన రెండు అక్షరాలు రాయండి. అర్థవంతమైన పదం వస్తుంది.


చెప్పుకోండి చూద్దాం!

1. చేతికి దొరకనిది, ముక్కుకు దొరుకుతుంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. పిడికెడంత పిండిని పదిమంది కూడా తినలేరు. ఏంటో తెలుసా?
3. చూపులేని కన్ను, సుందరమైన కన్ను, తోకకుండే కన్ను, కన్నుగాని కన్ను. కాలకంఠుని కన్ను. అదేంటో తెలుసా?


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


చెప్పగలరా?

1. నేను ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని. మీకెంతో ఇష్టమైనదాన్ని. మొదటి మూడు అక్షరాలు కలిస్తే.. నాలుగు చక్రాల వాహనాన్నవుతా. 2, 3, 4 అక్షరాలు ‘కళ’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవరో తెలిసిందా?
2. ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. పలికేటప్పుడు ఉండని ఓ అక్షరం.. రాసేటప్పుడు మాత్రం ఉంటుంది. చివరి నాలుగక్షరాలు కలిస్తే భూమి లేదా స్థలం అనే అర్థాన్నిస్తా. నేనెవరో తెలిసిందా?


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో ఒక్కో తప్పుంది. వాటిని గుర్తించి సరిచేసి రాయండి
1. బుదవారం  
2. ఆకాసం
3. బహుమాణం
4. ఆనుమానం
5. వ్యతిరేఖం
6. సందర్బం
7. మకరంధం
8. పర్యవశానం



నేను గీసిన బొమ్మ


జవాబులు

తమాషా ప్రశ్నలు: 1.పబ్లిసిటీ 2.పసందు 3.ఒక సారే.. (తర్వాత 198 అయిపోతుంది కదా)
రెండే రెండు!: 1.చిలుక 2.చిరుత 3.చిరుగు 4.చినుకు 5.చిరాకు 6.చిత్తము 7.చిత్రము 8.చిలుము 9.చిహ్నము 10.చిగురు
చెప్పుకోండి చూద్దాం!: 1.వాసన 2.సున్నం 3.నెమలి పింఛం
ఏది భిన్నం?: 3
అక్షరాల రైలు : AMBULANCE
చెప్పగలరా : 1. CARTOON 2. ISLAND
తప్పులే తప్పులు: 1.బుధవారం 2.ఆకాశం 3.బహుమానం 4.అనుమానం 5.వ్యతిరేకం 6.సందర్భం 7.మకరందం 8.పర్యవసానం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని