ఆ ఒక్కటీ ఏది?

ఇక్కడ కొన్ని జీవుల చిత్రాలున్నాయి. ఇందులో ఒకటి మాత్రం మిగతావాటితో పోల్చుకుంటే భిన్నంగా ఉంది. అది ఏదో చెప్పుకోండి చూద్దాం?

Published : 17 Apr 2022 01:44 IST

ఇక్కడ కొన్ని జీవుల చిత్రాలున్నాయి. ఇందులో ఒకటి మాత్రం మిగతావాటితో పోల్చుకుంటే భిన్నంగా ఉంది. అది ఏదో చెప్పుకోండి చూద్దాం?


చెప్పుకోండి చూద్దాం?

1. మీరంతా నన్ను సృష్టిస్తారు. కానీ, మీరెవ్వరూ నన్ను చూడలేరు. నేనెవరో చెప్పుకోండి?
2. బయట పచ్చన, లోన ఎర్రన, వేసవిలో నన్ను తింటే కడుపు చల్లన. ఏంటో తెలుసా?
3. నాకు నిలకడే లేదు. పట్టి బంధిస్తే తప్ప ఎక్కడా ఆగలేను. మెరుస్తూ ఉన్నా... దేనికీ అంటుకోను. నేనెవరో తెలుసా?


జత చేయండి

ఓ వైపు దేశాల పేర్లు, మరో వైపు రాజధానుల పేర్లున్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని జతపరచడమే.


వాక్యాల్లో ఆహారం!

ఈ వాక్యాల్లో ఆహార పదార్థాలు దాగున్నాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం.
1. పింకీ.. నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని నా సత్తా ఏంటో తప్పకుండా చూపిస్తా.. అర్థమైందా?
2. ఎన్నిసార్లు చెప్పాలి నీకు. నేను ఆ సమయంలో మైదానంలో ఉన్నాను అని.
3. నేను చెప్పాగా... రెయిన్‌ కోట్ల రేట్లు బాగా పెరిగాయని!
4. నిజానికి మా బలగం జిల్లా కేంద్రంలోనే ఉండిపోయింది.
5. నా వెనకే కుక్కలా తిరుగుతావెందుకు?


తమాషా ప్రశ్నలు!

1. ఏనుగులు ఏ సమయంలో ఆహారాన్ని తీసుకుంటాయి?
2. విద్యార్థులకు ఎంతో అవసరమైన, డీజిల్‌తో పనిలేని బస్‌?
3. చెట్టుకు కాయని ఫలం?


చిత్ర వినోదం!

ఆధారాల సాయంతో బొమ్మల పేర్లను గడుల్లో నింపగలరా?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.


తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం



నేను గీసిన బొమ్మ


జవాబులు

ఆ ఒక్కటీ ఏది?: గబ్బిలం (మిగతావి అన్నీ పక్షులు. గబ్బిలం మాత్రం క్షీరదం)

చెప్పుకోండి చూద్దాం: 1.పేరు 2.పుచ్చకాయ 3.పాదరసం

జత చేయండి: 1-డి, 2-ఇ, 3-ఎ, 4-సి, 5-ఎఫ్‌, 6-బి

వాక్యాల్లో ఆహారం: 1.పిస్తా 2.మైదా 3.గారె 4.గంజి 5.కేకు

తమాషా ప్రశ్నలు: 1.తమకు ఆకలేసినప్పుడు 2.సిలబస్‌  3.కర్మఫలం

చిత్ర వినోదం: 1.వానపాము 2.పానకం 3.కందిపప్పు 4.కప్పు 5. కడలి 6.కొడవలి

గజిబిజి బిజిగజి: 1.కారాగారం 2.కోటగోడ 3.జలచరం 4.వానరసేన 5.ఆపసోపాలు 6.ఆగమేఘాలు 7.శాంతిసందేశం 8.కళాకారుడు

తేడాలు కనుక్కోండి: 1.హిప్పో తోక 2.గుర్రం 3.టోపీ 4.కిటికీ 5.చెట్టు 6.చేప


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని