అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి....

Updated : 18 Apr 2022 06:00 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


చెప్పుకోండి చూద్దాం!

1.  నీటిమీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది. కానీ జీవి కాదు. మెరుస్తుంది కానీ మెరుపు కాదు. ఇంతకీ ఏంటో తెలుసా?
2. కడుపులోన పిల్లలు, కంఠములోన నిప్పులు. అరుపేమో ఉరుము. ఎరుపంటే మాత్రం భయం. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. కాటుక రంగు. కమలము హంగు. విప్పిన పొంగు, ముడిచిన కుంగు. ఏంటో తెలుసా?
4. తడిస్తే గుప్పెడు. ఎండితే బుట్టెడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?


తమాషా ప్రశ్నలు?

1.  రాత్రి అన్నం తినకుంటే ఏమవుతుంది?
2. వీసా అడగని దేశం ఏది?
3. ఒక రైలు ఉదయం పది గంటలకు కాచిగూడ నుంచి బయలు దేరింది. పదకొండు గంటలకు అది ఎక్కడ ఉంటుంది?
4. ఆఫ్రికాలో అరటిపండు ఎలా తింటారు?


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలున్నాయి కదా! వాటిల్లో ఒక్కోపదానికి మరో పర్యాయపదం ఉంది. మరి వాటిని కనిపెట్టండి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల చెట్టు: Strawberry

చెప్పుకోండి చూద్దాం: 1.నీటి బుడగ 2.బొగ్గుతో నడిచే రైలు 3.గొడుగు 4.పత్తి

తమాషా ప్రశ్నలు: 1.అన్నం మిగిలిపోతుంది 2.సందేశం 3.పట్టాల మీద 4.తొక్క ఒలుచుకుని

రాయగలరా!: హలం- నాగలి, అసి- కత్తి, తిమిరం- చీకటి, కప్ప- మండూకం, విత్తం- ధనం, సమరం- యుద్ధం, తనువు- శరీరం, హస్తం- చేయి, వనం- అడవి, పుత్రుడు- సుతుడు, వానరం- కోతి, విరి- కుసుమం, ధర- వెల, ఎలుక- మూషికం,  రుషి- ముని, కడలి- సముద్రం  

ఏది భిన్నం: b


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని