ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 12 May 2022 00:17 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


చెప్పగలరా?

వేసవి సెలవులు కావడంతో మొబైల్‌లో గేమ్స్‌ ఆడుకోవాలనుకుంది చిన్ని. అమ్మ దగ్గరకు వెళ్లి సెల్‌ఫోన్‌ అడిగింది. ఈ కిందున్న పజిల్‌ ఇచ్చి.. దానికి సమాధానం చెబితేనే ఫోన్‌ ఇస్తానని కండీషన్‌ పెట్టింది అమ్మ. చిన్నికి మీరేమైనా సాయం చేయగలరా?


పదమేంటి?

1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. మొత్తంగా ‘లోపల’ అనే అర్థాన్నిస్తే.. చివరి నాలుగక్షరాలు  ‘పక్కన’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవరో తెలిసిందా?

2. నేను ఏడక్షరాల ఆంగ్ల పదాన్ని. మొదటి మూడు అక్షరాలు కలిస్తే.. ‘ఫోన్‌లో ఇది లేకపోతే మాట్లాడలేని వస్తువు’నవుతా. 5, 4, 6, 7 అక్షరాలు కలిస్తే అబద్ధాలాడే వ్యక్తినవుతా. నేనెవరో చెప్పగలరా?


చెప్పుకోండి చూద్దాం?

1. ముగ్గురు సుతిమెత్తని రాజులకు కలిపి ఒకటే కిరీటం. అదేంటో చెప్పుకోండి చూద్దాం?
2. చీకటి పడగానే కోట్లలో వస్తాయి. తెల్లారే సరికేమో అన్నీ మాయమవుతాయి. కానీ ఒక్కటి మాత్రమే మిగులుతుంది. ఇంతకీ ఏంటవి?  
3. మనల్ని మోస్తాయి. నీళ్లు కనిపిస్తే మాత్రం మొరాయిస్తాయి. ఇంతకీ అవేంటో తెలుసా?





నేను గీసిన బొమ్మ


జవాబులు:

రంగుల్లో ఏముందో!: 1.పవనం 2.వానపాము 3.శరణం 4.ఉసిరికాయ 5.కుండపోత 6.పావురాయి
చెప్పగలరా : 636363 =
TN (6+3+6+3+6+3=27 - TWENTY SEVEN).(అంకెలను కూడగా వచ్చిన మొత్తాలను ఆంగ్లంలో రాస్తే.. వచ్చే మొదటి, చివరి అక్షరాలే జవాబు)  
పదమేంటి :
1. INSIDE 2. SIMILAR
చెప్పుకోండి చూద్దాం: 1.తాటికాయ 2.నక్షత్రాలు (పగటి పూట సూర్యుడు ఉంటాడు. సూర్యుడు కూడా నక్షత్రమే కదా) 3.చెప్పులు
ఏది భిన్నం?: 1



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని