ఏది వేరు?

ఇక్కడ కొన్ని ప్రయాణ సాధనాలున్నాయి. వీటిలో ఒకటి మాత్రం వేరుగా ఉంది. అది ఏదో చెప్పుకోండి చూద్దాం?

Published : 13 May 2022 01:49 IST

ఇక్కడ కొన్ని ప్రయాణ సాధనాలున్నాయి. వీటిలో ఒకటి మాత్రం వేరుగా ఉంది. అది ఏదో చెప్పుకోండి చూద్దాం?


చెప్పుకోండి చూద్దాం

1. తల్లేమో ముళ్ల రాక్షసి, పిల్లలేమో పగడాలు. ఏంటో తెలుసా?

2. పొరల పొరల దుస్తులు, బంగారు వన్నె జుట్టున్న తల్లికి కడుపునిండా పిల్లలే. అదేంటో చెప్పుకోండి చూద్దాం?

3. నురగలు కక్కుతుంది. నానాటికీ తరుగుతుంది. ఏంటో తెలుసా?


పదమేంటబ్బా!
కింద ఉన్న వృత్తంలోని అక్షరాల ఆధారంగా పూర్తి పదమేంటో చెప్పుకోండి చూద్దాం!


బొమ్మల్లో ఏముందో?
బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో నింపగలరా?


తమాషా ప్రశ్నలు

1. కనిపించని గ్రహం ఏంటి?

2. పగలు కూడా కనిపించే నైట్‌ ఏది?

3. స్కూలు బ్యాగులో ఉండని స్కేలు ఏంటి?

4. ప్రాణాలు కాపాడే కాలు?


చెప్పగలరా?

1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. చివరి నాలుగక్షరాలు కలిస్తే.. ఉంగరాన్నవుతా. 1, 3, 4, 5, 6 అక్షరాలు కలిస్తే ‘తీసుకురా’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరో తెలిసిందా?

2. నేను ఏడక్షరాల ఆంగ్ల పదాన్ని. మొదటి నాలుగు అక్షరాలు ‘ఉత్తీర్ణత’, 3, 2, 6, 7 అక్షరాలు ‘కాపాడు’ అనే అర్థాన్నిస్తాయి. నేను ఎవరో చెప్పగలరా?


వాక్యాల్లో జీవుల పేర్లు

1. రామూ.. ఊరుకో, తికమకపెట్టకు అందరినీ!

2. అనామికా.. కిలకిలమంటూ నువ్వు నవ్వుతుంటే, ఎంత బాగుంటుందో..

3. మొదట్లో చిరు.. తడబాటు తప్ప.. కార్యక్రమం అంతా దాదాపు సజావుగానే సాగింది.  

4. పాపం.. దిక్కు లేని పిల్లవాడు తను. ఎలా బతుకుతాడో ఏమో!

5. నదీ ప్రవాహం.. సరిగ్గా ఉంటేనే, మనం ఒడ్డుకు చేరగలం.


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

ఏది వేరు: ఫ్లయింగ్‌ సాసర్‌ (ఇది ఊహా వస్తువు)

చెప్పుకోండి చూద్దాం?: 1.రేగుపండ్లు   2.మొక్కజొన్న   3.సబ్బు

పదమేంటబ్బా!: hippopotamus

బొమ్మల్లో ఏముందో: 1.శునకం   2.కంకణం   3.గ్రహణం   4.గ్రహాంతరవాసి   5.రవ్వలడ్డు   6.గుడ్డు

తమాషా ప్రశ్నలు: 1.నిగ్రహం   2.గ్రానైట్‌   3.రిక్టర్‌ స్కేలు   4.టీకాలు

చెప్పగలరా :  1. BORING   2. PASSIVE

వాక్యాల్లో జంతువుల పేర్లు : 1.కోతి   2.కాకి   3.చిరుత   4.పంది   5.హంస

కవలలేవి?: b, c


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని