కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి

Published : 25 May 2022 00:04 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చదివి.. అవునో కాదో చెప్పండి.

1.  కంగారూల స్వస్థలం ఆస్ట్రియా.
2.  శ్రీలంక రాజధాని కొలంబో.

3.  తాజ్‌మహల్‌ గంగానది ఒడ్డున ఉంది.
4.  ఎడారి ఓడ అని గుర్రాన్ని పిలుస్తుంటారు.

5. హమ్మింగ్‌ బర్డ్‌ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పక్షి.
6. మృగరాజు అని పెద్దపులిని పిలుస్తారు.

7. ఆపిల్‌ నీళ్లలో తేలుతుంది.
8. దిల్లీలో ఓడరేవు ఉంది.


చెప్పుకోండి చూద్దాం?

1.  తల్లి దెయ్యం... పిల్లేమో పగడం.. ఏంటో తెలుసా?
2. ఊరికంతటికీ ఒకటే దుప్పటి. ఏంటది?
3. మూట విప్పితే రత్నాలు.. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
4. అందర్నీ చూస్తుంది. తనను తాను మాత్రం నేరుగా చూడలేదు. ఏంటో తెలుసా?


నేనెవర్ని?

1. అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. నిద్రలోనే అందరూ నన్ను పలకరిస్తుంటారు. 4, 2, 5 అక్షరాలు కలిస్తే చేతిని సూచిస్తాయి. 5, 4, 1 అక్షరాలు ‘పిచ్చి’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవర్ని?

2. నేను నాలుగు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి మూడక్షరాలు ‘చెవి’ని సూచిస్తే.. 1, 2, 4 అక్షరాలు ‘ఆమె’ అనే అర్థాన్నిస్తాయి. నేను ఎవరినో చెప్పగలరా?


తమాషా ప్రశ్నలు

1.  జుట్టుకు వరం?

2. విడమరిచి చెప్పే వరం?

3. కంగారు పుట్టించే వరం?





నేను గీసిన చిత్రం


జవాబులు :

కవలలేవి: 3, 4

బొమ్మల్లో ఏముందో!: 1.పుస్తకము 2.కలువ 3.లంగావోణి 4.గాడిద 5.బూడిద గుమ్మడి 6.గురక 7.కలం

చెప్పుకోండి చూద్దాం?: 1.రేగుపండు 2.ఆకాశం 3.దానిమ్మపండు 4.కన్ను

తమాషా ప్రశ్నలు: 1.సవరం 2.వివరం 3.కలవరం

అక్షరాల ఆట: 1.కమలం 2.కమతం 3.కవిత 4.కలము 5.కవాటం 6.కరవు 7.కమ్మని 8.కరము 9.కలప

అక్షరాల చెట్టు: AMBASSADOR

అవునా.. కాదా?: 1.కాదు 2.అవును 3.కాదు 4.కాదు 5.కాదు 6.కాదు 7.అవును 8.కాదు
నేనెవర్ని?:
1. DREAM 2. HEAR



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని