ముక్కు చూసి చెప్పండి!

నేస్తాలూ... ఇక్కడ కొన్ని జీవుల ముక్కుల చిత్రాలున్నాయి. వాటిని చూసి అవి ఏ జంతువులో చెప్పగలరేమో ప్రయత్నించండి.

Updated : 01 Jun 2022 01:37 IST

నేస్తాలూ... ఇక్కడ కొన్ని జీవుల ముక్కుల చిత్రాలున్నాయి. వాటిని చూసి అవి ఏ జంతువులో చెప్పగలరేమో ప్రయత్నించండి.


అక్షరాలచెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


చిత్రాల్లో ఏముందో!

ఈ బొమ్మల పేర్లను తెలుగులో గడుల్లో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


జత ఏది?

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటి జంట పదాలూ పక్కనే ఉన్నాయి. కానీ, అవి వరసలో లేవు. మీరు చేయాల్సిందల్లా వాటిని జతపరచడమే.


చెప్పుకోండి చూద్దాం?

1.  చూస్తే చూసింది కానీ కళ్లులేవు. నవ్వితే నవ్వింది కానీ నోరు లేదు తంతే తన్నబోయింది కానీ కాళ్లు లేవు. ఏంటో తెలుసా?

2. ముక్కుకు ముత్యం కట్టుకుని తోకతో నీళ్లు తాగుతుంది. ఏంటది?

3. ఎంతో నమ్మిన బంటు, వాసనతో వేటాడే బంటు. కనిపిస్తేనే సంతోషంతో ఊగి పోతుంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?  

4. తెల్లని సువాసనల మొగ్గ. ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఏంటది?


కనిపెట్టగలరా..

ఇక్కడున్న అంశాల్లో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టగలరా?

1.  పొద్దుతిరుగుడు, పత్తి, వేరుశనగ, నువ్వులు, కంది, వరి

2. స్మార్ట్‌ఫోన్‌, రిమోట్‌, ఛార్జర్‌, హెడ్‌సెట్‌, సిమ్‌, మెమొరీ కార్డు


తమాషా ప్రశ్నలు

1.  తవ్వితే కానీ కనబడని నిజం?

2. తినలేని జామ్‌?

3. ఊగిపోయే గ్రహం?


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన చిత్రం


జవాబులు

ముక్కు చూసి చెప్పండి:  1.సింహం  2.గుర్రం  3.ఒంటె  4.కుక్క  5.హిప్పోపొటమస్‌  6.పిల్లి

అక్షరాల చెట్టు: CATERPILLAR

చిత్రాల్లో ఏముందో!:  1.కంది పప్పు  2.మామిడిపండు  3.జీలకర్ర  4.మిరపకాయలు (దాగిఉన్న పదం: జీడిపప్పు)

జత ఏది:  1-ఎఫ్‌,  2-డి,  3-జి,  4-బి,  5-ఎ,  6-హెచ్‌,  7-సి,  8-ఇ

చెప్పుకోండి చూద్దాం?: 1.అద్దం  2.దీపం  3.కుక్క  4.కర్పూరం

కనిపెట్టగలరా : 1.కంది(మిగతా వాటిలోంచి నూనె తీయవచ్చు)  2.రిమోట్‌(మిగతావన్నీ సెల్‌ఫోన్‌కు సంబంధించినవి)

తమాషా ప్రశ్నలు:  1.ఖనిజం  2.ట్రాఫిక్‌ జామ్‌  3.ఆగ్రహం

ఏది భిన్నం: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని