తేడాలు కనుక్కోండి!

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 20 Jun 2022 05:22 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


చెప్పుకోండి చూద్దాం

1. చెట్టు చూడు.. చెట్టందం చూడు.. చిత్రమైన చిగురాకును చూడు.. పూసిందంటే ఒకటే పువ్వు చూడు.. కాసిందంటే గంపెడు కాయలు చూడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?

2. ఇంటింటికి ప్రవహిస్తూ వస్తుంది. పనులెన్నో చేస్తుంది. ప్రమోదకారి.. బహు ప్రమాదకారి కూడా. ఏంటో తెలుసా?

3. వెలుతురులో నీ తోటే ఉంటుంది. కానీ చీకటిలో తప్పించుకు పోతుంది. ఏంటది?


తమాషా ప్రశ్నలు

1. కాళ్ల కింద ఉండే వాచీ?
2. చెట్లెక్కే నరం?
3. ఆటలాడే దానం?


నేనెవర్ని?

1. ‘క్రీడా సామగ్రి’లో ఉన్నాను కానీ ‘బడి సామగ్రి’లో లేను. ‘ప్రయాణ ప్రాంగణం’లో ఉన్నాను కానీ ‘ప్రయాణ సాధనం’లో మాత్రం లేను. ఇంతకీ నేనెవర్ని?
2. ‘బెరడు’లో ఉన్నాను కానీ ‘పెరడు’లో లేను. ‘చిత్తం’లో ఉన్నాను కానీ ‘చిత్రం’లో లేను. నేనెవరినో తెలిసిందా?





నేను గీసిన చిత్రం


జవాబులు:

అక్షరాల చెట్టు: APPRECIATION

చెప్పుకోండి చూద్దాం: 1.ఆకాశం, చంద్రుడు, చుక్కలు 2.విద్యుత్తు 3.నీడ

పద వలయం: 1.పలక 2.పలుగు 3.పలుకు 4.పగులు 5.పగలు 6.పరాకు 7.పరాయి 8.పవనం

తమాషా ప్రశ్నలు: 1.తివాచీ 2.వానరం 3.మైదానం

ష్‌.. గప్‌చుప్‌: 1.చదరంగం 2.పనసపండు 3.పొద్దు తిరుగుడుపువ్వు 4.ఎలుగుబంటి 5.కోడిపుంజు 6.హరివిల్లు

తేడాలు కనుక్కోండి! 1.మేఘం 2.కుక్క కాలు 3.ఇంటి కప్పు 4.కిటికీ 5.ఇటుకలు 6.చొక్కా

నేనెవర్ని : 1.క్రీడా ప్రాంగణం 2.బెత్తం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని