అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 21 Jul 2022 00:21 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

1. నేను మూడక్షరాల పదాన్ని. ‘పాక’లో ఉంటాను. ‘ఈక’లో ఉండను. ‘గోవు’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. ‘రంపం’లో ఉంటాను. ‘కంపం’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

2. నేనో అయిదక్షరాల పదాన్ని. ‘రావి’లో ఉంటాను. ‘మోవి’లో ఉండను. ‘మనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ‘చిన్న’లో ఉంటాను. ‘మిన్న’లో ఉండను. ‘మేలు’లో ఉంటాను. ‘మేకు’లో ఉండను. ‘కలం’లో ఉంటాను. ‘బలం’లో ఉండను. నేనెవరో తెలుసా?


తప్పులే తప్పులు!

ఈ పదాల్లో ఒక్కో తప్పుంది. జాగ్రత్తగా చదివి కనుక్కోండి చూద్దాం.
1. కొటగోడ
2. రాజ్యాదికారం
3. మహాశంగ్రామం
4. గాలిపఠం
5. వాయుసేణ
6. వానరశైన్యం
7. శత్రుశేసం
8. దూరప్రయానం


పొడుపు కథలు

1. కంచు కోటలో కాపురం ఉంటుంది. ముట్టుకో చూస్తే ముడుచుకుంటుంది. ఏంటో తెలుసా?
2. విప్పితే పువ్వు, ముడిస్తే మొగ్గ. అదేంటో చెప్పుకోండి చూద్దాం?
3. పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది. తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది. అదేంటో తెలుసా?








నేను గీసిన బొమ్మ


జవాబులు:

జత చేయండి: 1-జి, 2-ఇ, 3-హెచ్‌, 4-ఎ, 5-సి, 6-డి, 7-ఎఫ్‌, 8-బి

కనికట్టు కనిపెట్టు: 1.అమ్మను 2.పొడి 3.పాడు 4.పెరుగు 5.నూరు జీవుల

అంత్యాక్షరి!: 1.కపోతం 2.గబ్బిలం 3.బల్లి 4.నాగుపాము 5.జీబ్రా

చిత్రాల్లో ఏముందో?: 1.మందారపువ్వు 2.దానిమ్మకాయ 3.కాగితపు పడవ 4.తలగడ 5.గడియారం

నేనెవర్ని?: 1.పావురం 2.రామచిలుక  గజిబిజి బిజిగజి: 1.పంచదార  2.చందమామ 3.రహదారి 4.గోరింటాకు 5.సాహసవీరుడు 6.సమయోచితం 7.శాంతిసందేశం 8.సమయానుకూలం

పొడుపు కథలు: 1.నత్త 2.గొడుగు 3.మొగలిపువ్వు అది ఏది: 2

తప్పులే తప్పులు: 1.కోటగోడ 2.రాజ్యాధికారం 3.మహాసంగ్రామం 4.గాలిపటం 5.వాయుసేన 6.వానరసైన్యం 7.శత్రుశేషం 8.దూరప్రయాణం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని