ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 27 Jul 2022 00:17 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘సమం’లో ఉన్నాను. ‘సుమం’లో లేను. ‘మనం’లో ఉన్నాను. ‘జనం’లో లేను. ‘గాయం’లో ఉన్నాను. ‘గానం’లో లేను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘ఆయువు’లో ఉన్నాను. ‘వాయువు’లో లేను. ‘రాగం’లో ఉన్నాను. ‘రోగం’లో లేను. ‘ధనం’లో ఉన్నాను. ‘ఘనం’లో లేను. ‘నలుసు’లో ఉన్నాను. ‘అలుసు’లో లేను. నేనెవర్నో తెలుసా?


పొడుపు కథలు

1. పడగ విప్పిన బాటసారి. పదిలంగా మనల్ని తీసుకువెళ్తాడు. ఎండకు, వానకు లొంగడు. గాలికి మాత్రం గజగజలాడతాడు. ఏంటో తెలుసా?
2. నీళ్ల నుంచి వస్తుంది. నీకూ, నాకూ రుచిని పంచుతుంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. నోరు లేదు కానీ అన్నీ చెబుతాను. ప్రాణం లేదు కానీ ఊళ్లకు వెళతాను. కాళ్లు లేవు కానీ మీ ఇంటికి వస్తాను. నేనెవరో తెలుసా?


చెప్పుకోండి చూద్దాం?

చరణ్‌, తరుణ్‌ను ఓ ప్రశ్న అడిగాడు. దానికి తరుణ్‌ సమాధానం చెప్పలేకపోయాడు. మరి మీరు చెప్పగలరా? ఇంతకీ ప్రశ్న ఏంటంటే... 100 లో నుంచి 2ను ఎన్నిసార్లు తీసివేయొచ్చు?


క్విజ్‌.. క్విజ్‌...!

1. గెంతలేని ఒకేఒక క్షీరదం ఏంటి?
2. మనదేశంలో పెద్ద నది ఏది?
3. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?
4. మనిషి భూమికి చేసిన అతి లోతైన రంధ్రం పొడవు ఎంత?
5. ఉసిరికాయలో ఏ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది?







నేను గీసిన చిత్రం


జవాబులు:

పట్టికలో పదం: APPROXIMATELY
గజిబిజి బిజిగజి!: 1.బహుమతి 2.సోదరుడు 3.పాఠశాల 4.వరిపొలం 5.వానపాము 6.సమావేశం 7.గాలిమర 8.మామిడిపండు
నేనెవర్ని?: 1.సమయం 2.ఆరాధన
పొడుపు కథలు: 1.గొడుగు 2.ఉప్పు 3.ఉత్తరం ఏది భిన్నం?: 2
క్విజ్‌.. క్విజ్‌...!: 1.ఏనుగు 2.గంగానది 3.జెనీవా 4.దాదాపు 12 కిలోమీటర్లు 5.‘సి’ విటమిన్‌ తమాషా ప్రశ్నలు: 1.అస్థిపంజరం 2.అక్రమార్కులు 3.కలత
బొమ్మల్లో ఏముందో!: 1.చిరుతపులి 2.తమలపాకు 3.మేకులు 4.మేకపిల్ల 5.పిల్లి
రాయగలరా: 1.వలయం 2.వరస 3.వలస 4.వసంతం 5.వరము 6.వరద 7.వనిత 8.వదిన చెప్పుకోండి చూద్దాం?: ఒక్కసారే.. ఎందుకంటే ఒక్కసారి తీసివేయగానే 100 కాస్తా 98 అవుతుంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని