తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 03 Aug 2022 00:26 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పొడుపు కథలు

1. పచ్చని పందిరి కింద ఎర్రని పెళ్లికూతురు. ఏంటో తెలుసా?
2. చిటారు కొమ్మన అరవై ఆరు కొడవళ్లు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. చక్కని పాపకు చుక్కల చీర. ఏంటో తెలుసా?


చెప్పగలరా?

1.  ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 2, 3 అక్షరాలు కలిస్తే ‘టోపీ’ అనీ.. 3, 7, 4 అక్షరాలు కలిస్తే ‘బఠాణీ గింజ’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

2. నేను తొమ్మిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. 6, 7, 8, 9 అక్షరాలు కలిస్తే ‘అద్దె’ అనీ.. 1, 2, 5 అక్షరాలు కలిస్తే ‘జుట్టుకు వేసుకొనేది’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?

3. నాలుగక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 2, 3 అక్షరాలు కలిస్తే ‘లోపల’ అనీ... 2, 3, 1 అక్షరాలు కలిస్తే ‘సిరా’ అనే అర్థాన్నిస్తా. నేనెవర్ని?


తమాషా ప్రశ్నలు

1.  చెవులకుండే కాలు?
2. అందరూ భయపడే పాలు?
3. నడవలేని సందు?



 


వాక్యాల్లో ప్రాంతాల పేర్లు

కింది వాక్యాల్లో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి కనిపెట్టండి చూద్దాం.
1.  అదిగో.. నడుచుకుంటూ వస్తున్న ఆ మాస్టారే మా అందరికీ మార్గదర్శి.
2. ద్రాక్ష గుత్తి కోసుకొని వస్తుంటే.. రమ్య కాలికి ముల్లు గుచ్చుకుంది.

3. చూడు భద్రా.. చలం వస్తానంటే సరే. లేకపోతే నేనూ రాను.
4. పాడు కాకి.. నాడలన్నీ చిందరవందరగా చేేసి వెళ్లిపోయింది.

5. నా పేరు నాగార్జున. సాగర్‌ను కలవాలని ఆదరాబాదరాగా వచ్చాను.
6. వచ్చేటప్పుడు దుకాణం నుంచి కేజీ బెల్లం, పల్లి కాయలు తీసుకురా.. మర్చిపోకు.


సమాధానాలు:

తమాషా ప్రశ్నలు: 1.జుంకాలు 2.శాపాలు 3.పసందు

పొడుపు కథలు: 1.మిరపకాయ  2.చింతకాయలు 3.ఆకాశం

పట్టికలో సందేశం : త్రివర్ణ పతాకం

తేడాలు కనుక్కోండి: 1.ఇల్లు 2.మేఘం 3.కోటు బొత్తాం 4.గోడ ఇటుకలు 5.కుక్క తోక 6.గొడుగు

వాక్యాల్లో ప్రాంతాల పేర్లు : 1.దర్శి 2.గుత్తి 3.భద్రాచలం 4.కాకినాడ 5.నాగార్జున సాగర్‌  6.బెల్లంపల్లి

తప్పులే తప్పులు! : 1.సిసింద్రీ 2.వేరుశనగలు 3.కందిపప్పు 4.మైక్రోస్కోప్‌ 5.పూలకుండీ 6.కళ్లజోడు 7.స్థిరాస్తి 8.విజయోత్సాహం 9.చెక్కభజన 10.సంబరం

చెప్పగలరా?: 1.CAPABLE 2.DIFFERENT 3.KING



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని