పట్టికలో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండు సార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే, అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.

Published : 16 Aug 2022 00:52 IST

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండు సార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే, అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


ప్రశ్నలోనే సమాధానాలు!

క్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. సరిగా గమనిస్తే వాటిలోనే మనకు సమాధానాలు కనిపిస్తాయి. అవి ఏంటో చెప్పుకోండి చూద్దాం?

1. రమణిలో ఉన్న యంత్రం?
2. సైకిల్‌ వెనుక పొంచి ఉన్న ప్రమాదం?
3. ఫౌంటెయిన్‌లో ఓ సంఖ్య?
4. కోరికలో ఉన్న వస్త్రం?
5. మనీషాలో దాగి ఉన్న ధనం?
6. మహబూబ్‌నగర్‌లో హారం?


చిత్రాల్లో ఏముందో!

ఈ బొమ్మల పేర్లను గడుల్లో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


చెప్పగలరా?

1. నేను మూడక్షరాల పదాన్ని. ‘పెనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ‘రుషి’లో ఉంటాను. ‘కృషి’లో ఉండను. ‘గుడి’లో ఉంటాను. ‘బడి’లో ఉండను. నేనెవరో తెలుసా?

2. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘గాజు’లో ఉంటాను. ‘బూజు’లో ఉండను. ‘వాలి’లో ఉంటాను. ‘వాగు’లో ఉండను. ‘మలుపు’లో ఉంటాను. ‘పిలుపు’లో ఉండను. ‘రవ్వ’లో ఉంటాను. ‘అవ్వ’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


అవునా.. కాదా?

ఇక్కడున్న వాక్యాల్లో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

1. మన జాతీయ పక్షి నెమలి.
2. ‘రఫెల్‌’ యుద్ధ విమానాలను మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
3. చెస్‌ బోర్డులో మొత్తం 64 గడులు ఉంటాయి.
4. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడలను ఆస్ట్రేలియాలో నిర్వహించారు.
5. భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌.
6. మూడు కళ్లు ఉండే జీవి ఒంటె.


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి చూద్దాం.

1. గ్రంధాలయం
2. వ్యాయామసాల
3. విజయకేథనం
4. సామరశ్యం
5. పాదరక్చలు
6. హ్రుదయాంజలి
7. మణోనేత్రం
8. కుంబకోణం


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



జవాబులు

పట్టికల్లో పదం: వందేమాతరం

ప్రశ్నలోనే సమాధానాలు: 1.మర 2.కిల్‌ 3.టెన్‌ 4.కోక 5.మనీ 6.నగ

చిత్రాల్లో ఏముందో!: 1.గొడుగు 2.మలుపు 3.కూజా 4.పంది (దాగి ఉన్న పదం: జామపండు) 

చెప్పగలరా?: 1.పెరుగు 2.గాలిమర అవునా.. కాదా? : 1.అవును 2.కాదు (ఫ్రాన్స్‌) 3.అవును 4.కాదు (ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌) 5.అవును 6.కాదు  తప్పులే తప్పులు: 1.గ్రంథాలయం 2.వ్యాయామశాల 3.విజయకేతనం 4.సామరస్యం 5.పాదరక్షలు 6.హృదయాంజలి 7.మనోనేత్రం 8.కుంభకోణం

ఏది భిన్నం: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని