అక్షరాల పట్టిక

ఇక్కడ ఓ పట్టిక ఉంది. దానిలో కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 19 Aug 2022 00:21 IST

ఇక్కడ ఓ పట్టిక ఉంది. దానిలో కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘అమ్మ’లో ఉన్నాను కానీ ‘కొమ్మ’లో లేను. ‘డప్పు’లో ఉన్నాను కానీ ‘కప్పు’లో లేను. ‘కవి’లో ఉన్నాను.. ‘రవి’లోనూ ఉన్నాను. నేనెవరినో తెలిసిందా?

2. నేను రెండక్షరాల పదాన్ని. ‘జుట్టు’లో ఉన్నాను కానీ ‘గుట్టు’లో లేను. ‘పన్ను’లో ఉన్నాను.. ‘గన్ను’లోనూ ఉన్నాను. నేనేవర్ని?


బొమ్మల్లో ఏముందో!

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


చెప్పగలరా?

1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 5, 4, 3 అక్షరాలను కలిపితే ‘పిల్లి’ అనీ.. 1, 2, 3, 4 అక్షరాలను కలిపితే ‘గోధుమపిండి’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

2. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 4, 5, 6, 7 అక్షరాలు కలిస్తే ‘సింహం’ అనీ.. 2, 3, 4 అక్షరాలు కలిస్తే ‘జబ్బు’ అనే అర్థాన్నిస్తా. నేనెవర్నో చెప్పగలరా?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గందరగోళంగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. మీరు ఒకసారి ప్రయత్నించండి.


అవునా.. కాదా?

ఇక్కడున్న వాక్యాల్లో ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.

1. ఇంద్రధనుస్సులో ఎనిమిది రంగులు ఉంటాయి.

2. మొసలి.. తన నాలుకను బయటపెట్టలేదు.  

3. గబ్బిలాలు పక్షి జాతికి చెందిన జీవులు కాదు.    

4. కోకిలలు చాలా అందంగా గూడు కట్టుకోగలవు.

5. పుట్టగొడుగుల్లో విషపూరితమైనవి కూడా ఉంటాయి.

6. పాండాలు వెదురును ఆహారంగా తీసుకుంటాయి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


సమాధానాలు

అక్షరాల పట్టిక: confederation

బొమ్మల్లో ఏముందో? : 1.కనకం 2.కనకాంబరాలు 3.రామచిలుక 4.జంతికలు 5.తిమింగలం 6.తరగతి

చెప్పగలరా? : 1. ATTACK 2. BILLION

గజిబిజి బిజిగజి : 1.కోడిగుడ్డు 2.జలపాతాలు 3.మిఠాయిలు 4.కథానాయకుడు 5.ధూమశకటం 6.పుస్తకాలయం 7.క్రీడాకారులు 8.పాఠ్యపుస్తకం నేనెవర్ని? : 1.అడవి 2.జున్ను  

అవునా.. కాదా? : 1.కాదు(ఏడు) 2.అవును 3.అవును 4.కాదు(అసలు గూడు కట్టుకోలేవు) 5.అవును 6.అవును

తేడాలు కనుక్కోండి :  1.కిటికీ 2.పిల్లనగ్రోవి 3.వెన్న 4.స్తంభం 5.నెమలీక 6.కుండ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని