నేనూ పీతనే...!
హాయ్ ఫ్రెండ్స్.. ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. నేను ఎవరనా? నేనేం కొత్త జీవిని కాదు నేస్తాలూ! నా గురించి మీకు తెలియదంతే. నేనో పీతను! ఏంటి మళ్లీ అవాక్కవుతున్నారు. ‘పీత ఇలా ఉండదే?’ అనుకుంటున్నారు కదూ! నిజంగా నేను పీతనే! కావాలంటే ఈ కథనం చదివేయండి.
చూడడానికి కాస్త విచిత్రంగా కనిపిస్తున్న నా పేరు శాండ్ క్రాబ్. మీరు మీ తెలుగులో ఇసుక పీత అని పిలుచుకోండి. నన్ను మోల్ క్రాబ్ అనీ అంటారు. నేను సముద్ర తీరాల్లో ఇసుకలో నివసిస్తాను. అందుకే నన్ను శాండ్ క్రాబ్ అని పిలుస్తారు.
బొటనవేలి కన్నా చిన్న!
నేను మీ బొటనవేలి కన్నా చిన్నగా ఉంటాను. మాలో ఆడవి మగవాటికన్నా పెద్దగా ఉంటాయి. 3.8 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వరకు పెరుగుతాం. మగవి మాత్రం కేవలం 1.9 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతాయి. మేం రోజులో చాలా సమయం ఇసుక కిందే గడుపుతాం. మరో విషయం ఏంటంటే మామూలు పీతలు వెనకకు, ముందుకు, పక్కకు ఇలా ఎటు అంటే అటు కదలగలవు. కానీ మేం మాత్రం కేవలం వెనక్కు మాత్రమే నడుస్తాం. అలాగే మాకు కొండీలు కూడా ఉండవు. కేవలం కాళ్లు మాత్రమే ఉంటాయి. కేవలం 1.5 సెకండ్లలోనే మమ్మల్ని మేం ఇసుకలో కప్పేసుకోగలం. అంటే నేను అంత వేగంగా ఇసుకను తోడేస్తాను అన్నమాట.
కుప్పలు.. తెప్పలు..
మాలో ఆడవి ఒక్కసారికి ఏకంగా 45,000 వరకు గుడ్లు పెడతాయి. ఇందులోంచి పిల్లలు రావడానికి దాదాపు 30 రోజులు పడుతుంది. మమ్మల్ని ఎక్కువగా పక్షులు, చేపలు ఆహారంగా తీసుకుంటాయి. మా జీవిత కాలం కేవలం రెండు నుంచి మూడు సంవత్సరాలే. కానీ మాలో చాలా వరకు అంతకు ముందే పక్షులకో, చేపలకో.. లేకపోతే మనుషులకో ఫలహారం అయిపోతాయి.
అలల్లోనే ఆహారం...
మేం సముద్ర తీరాల్లో ఇసుకలో ఉంటాం కదా.. అలలు వచ్చినప్పుడు వాటితో పాటే వచ్చే నాచు, ఇతర చిన్న చిన్న జీవులను మేం ఆహారంగా తీసుకుంటాం. మేం దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉంటాం. మీకో విషయం తెలుసా.. నేను చెన్నైలో చాలా మంది ఫేవరెట్ స్ట్రీట్ సీ ఫుడ్‌ను. తమిళనాడులో నన్ను ఇల్లిపూచి అని పిలుస్తారు. కొన్ని చోట్ల మత్స్యకారులు నన్ను పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోవడానికి ఎరలానూ వాడతారు. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా గురించి విశేషాలు. ఉంటామరి బై.. బై...!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం
-
General News
ED: మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత పేర్లు
-
Crime News
కారు ప్రమాదం.. కళ్లముందే నిండు గర్భిణీ, భర్త సజీవదహనం
-
World News
Mossad: ఇరాన్ క్షిపణి స్థావరంపై మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్..!
-
Politics News
nara lokesh-yuvagalam: కొత్త కంపెనీ వచ్చిందా? ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా?: నారా లోకేశ్