అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 06 Sep 2022 05:36 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని

ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే వినాయకుడి పేర్లలో ఒకటి వస్తుంది. అదేంటో కనుక్కోండి!


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

1. మలేరియా దోమల వల్ల వస్తుంది.
2. మానవ శరీరంలో రక్త సరఫరా జరగని ఏకైక భాగం మెదడు.
3. అరటి పండ్ల గెలని ఆంగ్లంలో ‘హ్యాండ్‌’ అంటారు. అందులోని పండ్లను ‘ఫింగర్స్‌’ అని పిలుస్తారు.
4. పాముల్లో అత్యంత వేగంగా పాకేది అనకొండ.  
5. డిస్నీ కార్టూన్‌ చిత్రాల్లో కనిపించే కోట పేరు ‘స్లీపింగ్‌ బ్యూటీ క్యాజిల్‌’. డిస్నీ సంస్థ లోగోలో కనిపించే కోట కూడా ఇదే.
6. తాజా ఆపిల్‌ నీళ్లలో మునుగుతుంది.


నేనెవర్ని?

నాలుగక్షరాల పదాన్ని నేను. ‘శోకం’లో ఉన్నాను కానీ ‘లోకం’లో లేను. ‘భారం’లో ఉన్నాను కానీ ‘గారం’లో లేను. ‘యాస’లో ఉన్నాను కానీ ‘శ్వాస’లో లేను. ‘త్రయం’లో ఉన్నాను కానీ ‘మాయం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


జవాబులు

అక్షరాల చెట్టు : INSPIRATIONAL

పట్టికల్లో పదం : గజాననుడు

ఏది భిన్నం : 3

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు (కంటిలోని కార్నియా) 3.అవును 4.కాదు (బ్లాక్‌మాంబా) 5.అవును 6.కాదు (దాని బరువులో 25 శాతం గాలే ఉండటంతో తేలుతుంది)

నేనెవర్ని? : శోభాయాత్ర బొమ్మల్లో ఏముందో? : 1.కందిరీగ 2.కర్రసాము 3.గడ్డివాము 4.వానపాములు 5.జలపాతం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని