అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పుకోండి చూద్దాం...

Published : 17 Sep 2022 00:11 IST

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పుకోండి చూద్దాం.

1. ఏనుగు దంతం ఒక్కొక్కటీ సుమారు 4 కేజీల బరువు ఉంటుంది.

2. చూపుడు వేలి కంటే చిటికెన వేలు పెద్దది.

3. జిరాఫీలు చాలా బాగా ఈదగలవు.  

4. పశువులకు కూడా మనుషుల్లాగానే 32 దంతాలుంటాయి.

5. ప్రపంచంలో అత్యంత పొడవైన నది నైలు.

6. మూడు కనురెప్పలు కలిగి ఉండే జంతువు.. ఏనుగు.


తమాషా ప్రశ్నలు

1. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దాచుకునే బుక్‌. ఏంటబ్బా?
2. ఎప్పుడూ తిరుగుదామనే కారు ఏది?
3. నవ్వు తెప్పించే టైర్‌ ఏంటి?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి గడుల్లో నింపగలరా?


పొడుపు కథలు

1. టిక్కు టిక్కు బండి. ఎక్కడా ఆగని బండి.. నడుస్తూనే ఉంటుందండి. అదేమిటి?
2. పళ్లు ఉన్నాయి కానీ నోరు మాత్రం లేదు. ఏంటది?
3. వీపు ఉంది కానీ వెన్నెముక లేదు. కాళ్లూ చేతులూ ఉన్నాయి కానీ వేళ్లు లేవు. అదేంటో?


 


జవాబులు  

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు (చిన్నది) 3.కాదు (ఈదలేవు) 4.అవును 5.కాదు (అమెజాన్‌) 6.కాదు (ఒంటె)

తమాషా ప్రశ్నలు : 1.చెక్‌బుక్‌ 2.షికారు 3.సెటైర్‌

అక్షరాల చెట్టు : INSIGNIFICANT

కవలలేవి? : 1, 3

బొమ్మల్లో ఏముందో? : 1.తాజ్‌మహల్‌ 2.మరమనిషి 3.షికారు 4.కారంపొడి 5.పొట్టేలు 6.పకోడి పొడుపు కథలు : 1.గడియారం 2.రంపం 3.కుర్చీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని