అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 10 Nov 2022 01:10 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?

1. సిమ్‌ కార్డు అవసరం లేని సాంకేతికతతో ఫోన్లు రాబోతున్నాయి.  

2. గోదావరి నది హిందూ మహాసముద్రంలో కలుస్తుంది.

3. ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా.

4. భారతదేశ జాతీయ క్రీడ.. హాకీ.

5. ఆటబొమ్మల తయారీలో చైనా ప్రథమ స్థానంలో ఉంది.

6. చక్కెరను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం.. భారత్‌.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘మైనా’లో ఉంటాను కానీ ‘హైనా’లో లేను. ‘దారం’లో ఉంటాను కానీ ‘ఘోరం’లో లేను. ‘నందకం’లో ఉంటాను కానీ ‘కందకం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘ఆరాటం’లో ఉన్నాను కానీ ‘పోరాటం’లో లేను. ‘పాట’లో ఉన్నాను కానీ ‘పాఠం’లో లేను. ‘వ్యవస్థ’లో ఉన్నాను కానీ ‘వ్యవసాయం’లో లేను. ‘జలం’లో ఉన్నాను కానీ ‘జనం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడున్న పక్షుల్లో ఒక్కటి మాత్రం మిగతావాటికి భిన్నంగా ఉంది. అదేంటో కనుక్కోండి చూద్దాం.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే ఒక అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి!


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


తమాషా ప్రశ్నలు

1. ఉప్పు లేదా కారానికి మధ్యలో ఏముంది?

2. ఏడాది ప్రారంభంలోనే వచ్చే వరి ఏది?


జవాబులు

అక్షరాల చెట్టు : CIRCUMFERENCE

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.అవును 4.అవును 5.అవును 6.కాదు

నేనెవర్ని? : 1.మైదానం 2.ఆటస్థలం

ఆ ఒక్కటి ఏది? : 4-హమ్మింగ్‌ బర్డ్‌ (మిగతావి వెనక్కు ఎగరలేవు)

గజిబిజి బిజిగజి : 1.అధినాయకుడు 2.ఉభయచరాలు 3.ఆటలపోటీలు 4.క్రీడామైదానం 5.రహదారులు 6.కుతూహలం 7.కితకితలు 8.పరమానందం

పట్టికల్లో పదం : ఎండమావులు

అది ఏది? : 3

తమాషా ప్రశ్నలు : 1.‘లేదా’ అనే పదం 2.జనవరి
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని