అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 12 Nov 2022 00:11 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓ చోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘పన్ను’లో ఉంటాను కానీ ‘దన్ను’లో లేను. ‘ముల్లె’లో ఉంటాను కానీ ‘ముల్లు’లో లేను. ‘టాటూ’లో ఉంటాను కానీ ‘టాటా’లో లేను. ‘పోరు’లో ఉంటాను కానీ ‘పోటు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘రాత్రి’లో ఉంటాను కానీ ‘రాతి’లో లేను. ‘శూరుడు’లో ఉంటాను కానీ ‘వీరుడు’లో లేను. ‘కాలం’లో ఉంటాను కానీ ‘కాయం’లో లేను. నేను ఎవరినో చెప్పగలరా?


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.

1.  రాయలశీమ

2. బవనం

3. సంతోసం

4. సంభరాలు

5. సమాలోచణ

6. సంఘ్రామం

7. ఆరోపన

8. అవరోదం  


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



జవాబులు

అక్షరాల చెట్టు: Sportsmanship 

పట్టికల్లో పదం : కారుచీకట్లు

నేనెవర్ని? : 1.పల్లెటూరు 2.త్రిశూలం తప్పులే తప్పులు: 1.రాయలసీమ 2.భవనం 3.సంతోషం 4.సంబరాలు 5.సమాలోచన 6.సంగ్రామం 7.ఆరోపణ 8.అవరోధం

ఏది భిన్నం? : 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని