పిల్లలూ ‘పది’లం!

చిన్నారులమైన మనకు చాచా నెహ్రూ బోలెడు మంచి సూక్తులు చెప్పారు. అందులో ఓ పది ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం తెలుసుకోవడమే కాదు, ఆచరించే ప్రయత్నమూ చేద్దాం.. సరేనా!

Published : 14 Nov 2022 00:11 IST

చిన్నారులమైన మనకు చాచా నెహ్రూ బోలెడు మంచి సూక్తులు చెప్పారు. అందులో ఓ పది ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం తెలుసుకోవడమే కాదు, ఆచరించే ప్రయత్నమూ చేద్దాం.. సరేనా!

* లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగం.

* జ్ఞానం వల్ల మాత్రమే మన ఉనికిని ఊహించగలం.

* చదువుతోపాటు పెద్దలతో వినయంగా ఉండటమూ నేర్చుకోవాలి.

* పనిని అభిమానించడం మొదలుపెడితే విజయం దానంతట అదే వస్తుంది.

* పరాయి వాళ్ల దివ్య సౌధాల్లో జీవించడం కన్నా సొంతదైన పూరి గుడిసెలో నివసించడం మిన్న.

* వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు. అది కొత్త ప్రేరణకు నాంది కావాలి.

* చరిత్ర చదవడమే కాదు. సృష్టించాలి.

* లక్ష్యాలు, ఆలోచనలు, విలువలు మరిచిపోయేవారు మాత్రమే అపజయం పాలవుతారు.

* మితిమీరిన విశ్రాంతి అన్ని విధాలా అనర్థం.

* చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే, పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలను సాధించగలరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని