అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 15 Nov 2022 00:41 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


ఒప్పులు ఏవో... తప్పులు ఏవో...

నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరికొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండిచూద్దాం.

1.  సింహాచలం

2. వఢగండ్లు

3. షుడిగాలి

4. విశాఖపట్నం

5. అభిమాణి

6. ఆరాధన

7. బంగాలాఖాతం

8. వర్షపాథం


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అవునా.. కాదా...?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పుకోండి చూద్దాం.

1.  చైనాలో ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా ఉంది.

2. రష్యా రాజధాని కొలంబో.

3. శ్రీలంక ఒక ద్వీపకల్పం.

4. జాతిపిత అని గాంధీజీకి పేరు.  

5. వాననీటిలో విటమిన్‌- డి ఉంటుంది.

6. మొసలిని మకరం అని కూడా పిలుస్తారు.

7. బొద్దింక తన తల తెగినా దాదాపు వారం వరకు బతకగలదు.

8. విద్యుత్‌ బల్బును రైట్‌ సోదరులు కనిపెట్టారు.


నేనెవర్ని?

1. నేను అయిదక్షరాల పదాన్ని. ‘కలం’లో ఉంటాను. ‘హలం’లో ఉండను. ‘నక్క’లో ఉంటాను. ‘కుక్క’లో ఉండను. ‘కాంతి’లో ఉంటాను. ‘భ్రాంతి’లో ఉండను. ‘బలం’లో ఉంటాను. ‘జలం’లో ఉండను. ‘రంగు’లో ఉంటాను. ‘హంగు’లో ఉంటాను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘సీసం’లో ఉంటాను. ‘సీరం’లో ఉండను. ‘పదం’లో ఉంటాను. ‘నాదం’లో ఉండను. ‘పొద’లో ఉంటాను. ‘పొలం’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

ముని, పని, వానరం, రంపం, భూకంపం, పంజరం, దయ, జాలి, కరుణ, పరివారం, సోమవారం, అరటిచెట్టు, జామపండు, ఎలుగుబంటి, ఏనుగు, సింహం


జవాబులు

అది ఏది?: 1

ఒప్పులు ఏవో... తప్పులు ఏవో...: ఒప్పులు: 1, 4, 6  తప్పులు: 2 (వడగండ్లు), 3 (సుడిగాలి), 5 (అభిమాని), 7 (బంగాళాఖాతం), 8 (వర్షపాతం)

అక్షరాల చెట్టు: BRAINSTORMING

అవునా.. కాదా..?: 1.అవును 2.కాదు 3.కాదు 4.అవును 5.కాదు 6.అవును 7.అవును 8.కాదు నేనెవర్ని?: 1.కనకాంబరం 2.సంపద


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని