పద వలయం!
ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘ను’ అక్షరంతోనే ముగుస్తాయి.
అక్షరాల చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.
నేనెవర్ని?
1. అయిదు అక్షరాల పదాన్ని నేను. ‘అన్నం’లో ఉన్నాను కానీ ‘సున్నం’లో లేను. ‘వరి’లో ఉన్నాను కానీ ‘బరి’లో లేను. ‘యముడు’లో ఉన్నాను కానీ ‘భీముడు’లో లేను. ‘వాము’లో ఉన్నాను కానీ ‘నోము’లో లేను. ‘మేలు’లో ఉన్నాను కానీ ‘మేషం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘బలుపు’లో ఉన్నాను కానీ ‘అలుపు’లో లేను. ‘లవణం’లో ఉన్నాను కానీ ‘శ్రవణం’లో లేను. ‘పంట’లో ఉన్నాను కానీ ‘మంట’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
సాధించగలరా?
ఇక్కడ ఆంగ్ల అక్షరాల వరస ఒకటి ఉంది. వాటి క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలించి, ప్రశ్నార్థకం స్థానంలో వచ్చే అక్షరాలను కనిపెట్టగలరా?
E, O, E, R, E, X, N, T, E, N, ?, ?, ?
అవునా.. కాదా?
ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1. బ్లాక్మాంబా పాములకు ఆ పేరు వాటి శరీర రంగు ఆధారంగా వచ్చింది.
2. విమానం నేల మీది నుంచి ఆకాశంలోకి ఎగరడాన్ని టేకాఫ్ అంటారు.
3. స్టంపౌట్ అనే పదం క్రికెట్కు సంబంధించినది.
4. టాయిలెట్లో కంటే సెల్ఫోన్ మీదే ఎక్కువ బాక్టీరియా ఉంటుంది.
5. ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహం రష్యాలో ఉంది.
6. చేపలు తమ మొప్పలతో రుచి చూడగలవు.
గజిబిజి బిజిగజి
ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే.. అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.
1. కలనంఅద
2. మపులాకరం
3. కరిరాపలు
4. గలమీపాడ
5. మపింధుగోడి
6. టకటాకలు
7. పండితుబలు
8. హమనోరుసుడు
9. ళాదుంబంపగా
10. కురకూఆలు
11. పాసయలమన
12. లాఫశికంల
జవాబులు
పద వలయం : 1.అదును 2.పదును 3.తుపాను 4.డజను 5.అతను 6.అవును 7.జవాను 8.సెకను
అది ఏది?: 2
అక్షరాల చెట్టు : CONSIDERATION
నేనెవర్ని? : 1.అవయవాలు 2.బలపం
సాధించగలరా? : వి, ని, వి (1 నుంచి 13 వరకు ఆంగ్ల పదాల్లోని చివరి అక్షరం)
అవునా.. కాదా? : 1.కాదు 2.అవును 3.అవును 4.అవును 5.కాదు 6.అవును
గజిబిజి బిజిగజి : 1.అలకనంద 2.కమలాపురం 3.పరికరాలు 4.పాలమీగడ 5.గోధుమపిండి 6.కటకటాలు 7.బడిపంతులు 8.సుమనోహరుడు 9.బంగాళాదుంప 10.ఆకుకూరలు 11.సమయపాలన 12.శిలాఫలకం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs PAK: పాక్ ఆటగాళ్లను భారత అభిమానులు ఎంతో గౌరవిస్తారు: ఉమర్ అక్మల్
-
India News
PM-KUSUM: ‘పీఎం కుసుమ్’ పథకం 2026 వరకు పొడిగింపు
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!
-
Sports News
IPL 2023: అప్పటికల్లా.. ఫుట్బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
-
World News
Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్