పండు.. పండు.. సలాక్ పండు!
హాయ్ నేస్తాలూ! ఇదో వింత పండు. దీని పేరు సలాక్. దీనికి మరో పేరు కూడా ఉంది. దీని రుచి కూడా బాగుంటుంది. దీనికున్న ఇంకో పేరేంటి? దీని రుచి ఎలా ఉంటుంది. ఇంతకీ ఈ పండు పుట్టినిల్లు ఎక్కడ. ఇలా.. ఎన్నో విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం సరేనా! మరింకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.
సలాక్.. పామ్ రకానికి చెందిన చెట్టు. దీని స్వస్థలం ఇండోనేషియాలోని జావా, సుమత్రా దీవులు. వీటితోపాటు చుట్టుపక్కల ఉన్న మరికొన్ని దీవుల్లోనూ ఈ చెట్లు ఉన్నాయి. కానీ విచిత్రంగా మలేషియన్ స్టాంప్ మీద ఈ సలాక్ పండు తన స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత అరుదైన పండు కాబట్టే, మలేషియా ప్రభుత్వం ఈ గౌరవాన్ని ఇచ్చింది.
పాము పండు!
ఈ సలాక్ పండును స్నేక్ ఫ్రూట్, స్నేక్ స్కిన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. దాని తొక్క, పాము చర్మాన్ని పోలి ఉండటమే దీనికి కారణం. నిజానికి సలాక్ పండుకంటే కూడా స్నేక్‌ఫ్రూట్‌గానే ఇది ఫేమస్.
ఆహా.. ఏమి రుచి!
ఈ పండు రుచి కాస్త పైనాపిల్‌లా ఉన్నా, తియ్యగా ఉంటుంది. కానీ దీని తొక్క కాస్త గట్టిగా ఉంటుంది. చిన్న చిన్న ముళ్లలాంటి నిర్మాణాలూ ఉంటాయి. గుజ్జు తెల్లగా, లేత పసుపురంగులో, జ్యూసీగా ఉంటుంది. చెట్టేమో ఆరు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.
రకరకాలు...
స్నేక్‌ఫ్రూట్‌లో దాదాపు 30 రకాల పండ్లుంటాయి. ఇవన్నీ కూడా రుచికరంగానే ఉంటాయి. స్థానికులతోపాటు, పర్యాటకులు కూడా వీటిని ఇష్టంగా తింటారు. మీకు మరో విషయం తెలుసా.. ఈ పండ్ల చెట్లు మనదేశంలోనూ ఉన్నాయి. కేరళలో అనుకూల వాతావరణం ఉండటంతో అక్కడ కొద్ది మొత్తంలో వీటిని పెంచుతున్నారు. ఇంకా చైనా, సింగపూర్, పిలిప్పీన్స్, ఆస్ట్రేలియాలోనూ సాగు స్తున్నారు.
ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఈ పండును ఇండోనేషియాలో ‘ఫ్రూట్ ఆఫ్ మెమరీ’ అని పిలుస్తారు. దీనిలో పొటాషియం, పెక్టిన్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండూ మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంకా థయామిన్, ఐరన్, కాల్షియం, విటమిన్ సి కూడా ఉంటాయి. నేస్తాలూ! ఇవీ సలాక్ పండు విశేషాలు. మొత్తానికి భలే ఉన్నాయి కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni-IPL: ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ రిటైర్ అవుతాడా? చాట్‌జీపీటీ సమాధానం ఇదే..
-
Politics News
D Srinivas: సొంతగూటికి డీఎస్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Malla Reddy: నన్ను పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు: మల్లారెడ్డి
-
Politics News
Vundavalli Sridevi: జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
-
Movies News
NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ సర్ప్రైజ్ గిఫ్ట్ .. తనకూ కావాలని కోరిన తారక్