చెట్టు.. పుస్తకాలతో అదిరేట్టు..!
హలో ఫ్రెండ్స్.. మనం ఆదివారం వస్తే ఏం చేస్తాం? - సెలవు రోజు కాబట్టి ఎంచక్కా ఇంట్లో టీవీ చూడటమో, సెల్‌ఫోన్లో గేమ్స్ ఆడుకోవడమో చేస్తాం.
హలో ఫ్రెండ్స్.. మనం ఆదివారం వస్తే ఏం చేస్తాం? - సెలవు రోజు కాబట్టి ఎంచక్కా ఇంట్లో టీవీ చూడటమో, సెల్‌ఫోన్లో గేమ్స్ ఆడుకోవడమో చేస్తాం. కొన్నిసార్లు బయటకెళ్లి స్నేహితులతో సరదాగా గడుపుతాం. కానీ, ఓ ప్రాంతంలో మాత్రం విద్యార్థులంతా కలిసి ‘ట్రీ లైబ్రరీ’ దగ్గరకు వెళ్తారు. ఇప్పటివరకూ రకరకాల లైబ్రరీల గురించి విన్నాం కానీ, ఇదేదో కొత్తగా ఉందేంటని అనుకుంటున్నారా? మరింకెందుకాలస్యం.. ఆ విశేషాలేంటో మీరే చదివేయండి..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అలీపుర్‌ద్వార్ జిల్లాలో బేస్తుర, గోదాంధుర అనే రెండు గ్రామాలున్నాయి. ఆ ఊళ్ల మధ్యలో వందల ఏళ్ల నాటి ఓ పెద్ద చెట్టు ఉంది. నిమేష్ అనే అన్నయ్య.. ఆ చెట్టును ‘ట్రీ లైబ్రరీ’గా మార్చేశారు. దానికి ‘స్వరాజ్’ అని పేరు కూడా పెట్టారు. ప్రతి ఆదివారం ఆ చెట్టు కాండానికి, కొమ్మలకు చెక్కల సాయంతో పుస్తకాలను వేలాడదీసి.. విద్యార్థులు, యువత, పెద్దలను అక్కడికి రప్పించడంలో విజయవంతమయ్యాడు.
అసలా ఆలోచన ఎలాగంటే..
నిమేష్ అన్నయ్య రోజూ అదే మార్గంలో కాలేజీకి వెళ్లివచ్చేవాడట. అయితే, ఆ చెట్టు కింద కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటాన్ని గమనించాడు. అప్పుడే, ఆ ప్రాంతాన్ని ఏదైనా మంచి పనికి వినియోగించాలని అనుకున్నాడు. దాంతో ‘ట్రీ లైబ్రరీ’ ఆలోచనకు ప్రాణం పోశాడు. మొదట తన దగ్గరున్న 20 పుస్తకాలనే కొన్ని చెక్కల సాయంతో చెట్టు కాండం చుట్టూ తగిలించాడు. ప్రతి ఆదివారం స్థానిక విద్యార్థులకు అక్కడికి రావాలని చెప్పడం ప్రారంభించాడు. మొదట్లో ఒకరిద్దరే వచ్చేవారట. కొద్దిరోజులకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. పిల్లలతోపాటు యువతీయువకులూ రాసాగారు. అదే సమయంలో ఈ సరికొత్త లైబ్రరీ గురించి సోషల్ మీడియాలోనూ రావడంతో నెటిజన్లతోపాటు ఈ అన్నయ్య స్నేహితులూ స్పందించారు. వారి దగ్గరున్న పుస్తకాలను అందించారు.
బోలెడు కార్యక్రమాలు..
ఈ ట్రీ లైబ్రరీ వద్ద కేవలం పుస్తకాలు చదవడమే కాకుండా ‘సండే ఆర్ట్-హట్’ పేరిట స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్ తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎవరైనా తమ ప్రతిభను ఇక్కడ ప్రదర్శించవచ్చు. ఇక్కడి పుస్తకాలను ఇంటికి కూడా తీసుకెళ్లవచ్చు. వారంలోగా చదివేసి, మళ్లీ వచ్చే ఆదివారం తిరిగివ్వాలనేది నిబంధన. ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఈ లైబ్రరీ తెరిచే ఉంటుంది.
అందరి బాధ్యత..
ఈ లైబ్రరీ దగ్గరకు ప్రతి వారం అధిక సంఖ్యలో వచ్చివెళ్తుంటారు. మరి అంతమంది ఒక దగ్గర చేరారంటే.. ఎంతో కొంత చెత్త కూడా పేరుకుపోతుంది కదా.. అందుకే, ఆ చెట్టు పరిసరాలను శుభ్రంగా ఉంచే బాధ్యతను కూడా వీళ్లే చూసుకుంటారు. ఎవరికి వాళ్లు ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తెచ్చుకోకుండా, ఇక్కడే ఓ కుండను ఏర్పాటు చేశాడా అన్నయ్య. ఏడాది నుంచి ప్రతి వారం క్రమం తప్పకుండా సాగుతున్న ఈ లైబ్రరీ గురించి తెలిసి.. చుట్టుపక్కల గ్రామాల వాళ్లూ నిమేష్‌కు ఫోన్ చేస్తున్నారట. తమ దగ్గరా అలాంటివి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నేస్తాలూ.. ‘ట్రీ లైబ్రరీ’ ఆలోచన భలే ఉంది కదూ.!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vikarabad: స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది విద్యార్థులు సురక్షితం
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నించనున్న నార్కోటిక్ పోలీసులు
-
సముద్ర తీరంలో 144 సెక్షనా?చంద్రబాబు సైకత శిల్పం వద్ద నిరసన తెలిపిన తెదేపా నేతలపై కేసులు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala : హనుమంత వాహనంపై మలయప్పస్వామి అభయం
-
Epuri Somanna: త్వరలో భారాసలోకి ఏపూరి సోమన్న