ఆలోచనల పుట్ట.. కోడింగ్‌లో దిట్ట!
హలో ఫ్రెండ్స్.. రోజూ బడి నుంచి వచ్చాకో లేదా సెలవు రోజో సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడేస్తుంటాం కదా! ఆ ఫోన్లలో సోషల్ నెట్‌వర్కింగ్, ట్రావెల్, షాపింగ్ తదితర బోలెడు ఆప్స్ మీకు కనిపిస్తుంటాయి.
హలో ఫ్రెండ్స్.. రోజూ బడి నుంచి వచ్చాకో లేదా సెలవు రోజో సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడేస్తుంటాం కదా! ఆ ఫోన్లలో సోషల్ నెట్‌వర్కింగ్, ట్రావెల్, షాపింగ్ తదితర బోలెడు ఆప్స్ మీకు కనిపిస్తుంటాయి. వాటిని చూసినప్పుడు ‘అసలు అవి ఎలా పనిచేస్తాయి?’ అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా.. ఓ నేస్తానికైతే వచ్చింది.. ఆ సందేహంలోంచి వచ్చిన ఆలోచనే తనకు రికార్డు కూడా తెచ్చిపెట్టింది. ఆ వివరాలే ఇవీ..
దిల్లీకి చెందిన సయాన్ గుప్తాకు ప్రస్తుతం 13 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులోనే దాదాపు వందకు పైగా ఆప్స్ సొంతంగా తయారు చేశాడు. అంతేకాదు.. ‘యంగెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్(మేల్)’గా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించాడు.
అతి తక్కువ సమయంలో..
అందరి పిల్లల్లాగే సయాన్ కూడా సెల్‌ఫోన్‌లో ఆటలు ఆడటం, సినిమాలు చూడటం చేసేవాడు. ఒకరోజు తనకు అసలు ఈ ఆప్స్ ఎలా పనిచేస్తాయోననే సందేహం వచ్చింది. తన సందేహాన్ని తండ్రిని అడిగాడు. ప్రోగ్రామింగ్ సహాయంతో ఆప్స్ పనిచేస్తాయని, దానికి కోడింగ్ అవసరం అని చెప్పారాయన. ఆ సమయంలోనే తనకూ కోడింగ్ నేర్చుకోవాలని అనిపించింది. తన ఆసక్తిని తల్లిదండ్రులకు చెప్పడంతో వారూ సరేనన్నారు. అలా తొమ్మిదేళ్ల వయసులో కోడింగ్ శిక్షణకు వెళ్లడం ప్రారంభించాడు. సీ, సీ++, జావా తదితర లాంగ్వేజెస్‌పైన పట్టు సాధించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనా అవగాహన ఏర్పరచుకున్నాడు.
పోటీల్లో పాల్గొంటూ..
‘కోడింగ్ నేర్చుకుంటున్నాం సరే.. మరి మనకు ఎంతవరకు వచ్చిందనేది ఎలా తెలుస్తుంది?’ - ఇదే ప్రశ్న సయాన్‌కూ వచ్చింది. వెంటనే స్థానికంగా, ఆన్‌లైన్‌లో నిర్వహించే పోటీలకు హాజరవ్వడం ప్రారంభించాడు. వివిధ స్థాయిల్లో అవార్డులు కూడా అందుకున్నాడు. అలా ఎక్కడ పోటీలు జరిగినా వెళ్తూ, తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఇప్పటివరకూ దాదాపు 100కు పైగా ఆప్స్‌ను రూపొందించాడు. గతేడాది ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ప్రతినిధుల సమక్షంలోనూ తన ప్రతిభను ప్రదర్శించాడు. ఇటీవల అధికారిక ధ్రువీకరణ పత్రం కూడా అందుకున్నాడు.
మరింత మందికి నేర్పించాలని..
తను నేర్చుకున్న కోడింగ్ అంశాలను ఇతర విద్యార్థులకు కూడా తెలియజేయాలని అనుకున్నాడు. ఆ అంశాలన్నింటినీ ఉచితంగానే పాఠాల రూపంలో తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు. అంతేకాదు.. ‘10ఎక్స్‌కోడర్‌కిడ్స్’ పేరిట సొంతంగా ఒక సంస్థను కూడా ప్రారంభించాడు. ఈ వేదికగా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా కోడింగ్‌తోపాటు రోబోటిక్స్ పాఠాలూ చెబుతున్నాడు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, పాటలు వినడం, గిటార్ వాయించడం, క్రికెట్, చెస్ ఆడటం చేస్తుంటాడట. నేస్తాలూ.. ఈ వయసులోనే ప్రపంచ రికార్డు సాధించిన సయాన్‌కు మనమూ కంగ్రాట్స్ చెప్పేద్దాం..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala : హనుమంత వాహనంపై మలయప్పస్వామి అభయం
-
Epuri Somanna: త్వరలో భారాసలోకి ఏపూరి సోమన్న
-
Hyderabad: ప్యాసింజర్ కష్టాలు.. 2017 సంవత్సరం నుంచి 161 రైళ్ల రద్దు
-
Andhra News : సీఎం కుటుంబానికి విదేశాల్లోనూ భద్రత
-
Khammam: ఒక్క కాలే అయినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసం