నేనెక్కడో చెప్పుకోండి!

ఇక్కడున్న ఫొటోని చూస్తే ‘ఏంటీ ఎండిపోయి రాలిపోయిన ఏవో ఆకులతో సరదాగా కప్ప బొమ్మను చేసినట్టున్నారే’ అనిపిస్తోంది కదూ. కానీ కానే కాదు. ఇది నిజంగా కప్పే. దీని పేరు లాంగ్‌ నోస్డ్‌ హార్న్‌డ్‌ ఫ్రాగ్‌. ఇంకా మలయన్‌ హార్న్‌డ్‌ ఫ్రాగ్‌, మలయన్‌ లీఫ్‌ ఫ్రాగ్‌ అనీ

Updated : 26 Mar 2021 01:01 IST

క్కడున్న ఫొటోని చూస్తే ‘ఏంటీ ఎండిపోయి రాలిపోయిన ఏవో ఆకులతో సరదాగా కప్ప బొమ్మను చేసినట్టున్నారే’ అనిపిస్తోంది కదూ. కానీ కానే కాదు. ఇది నిజంగా కప్పే. దీని పేరు లాంగ్‌ నోస్డ్‌ హార్న్‌డ్‌ ఫ్రాగ్‌. ఇంకా మలయన్‌ హార్న్‌డ్‌ ఫ్రాగ్‌, మలయన్‌ లీఫ్‌ ఫ్రాగ్‌ అనీ పిలిచేస్తుంటారు.ఇది ఎక్కువగా థాయిలాండ్‌, సింగపూర్‌ ప్రాంతాల్లో కనిపిస్తుంటుంది.
ఇంచుమించు మన అరచేయంత సైజులో ఉంటుందీ కప్ప. దీని రూపమే ఎండిన ఆకులతో చేసిపెట్టినట్టు భలేగుంటుంది. దీని కళ్లపైన కూడా కొమ్ముల్లాంటి భాగాలు గమ్మత్తుగా ఉంటాయి. ఈ వింత ఆకారంతోనే నేలపై ఆకుల్లో కలిసిపోయి కనిపించకుండా మాయ చేస్తుంది. చిన్న చిన్న పురుగులు, సాలీళ్లు, బుల్లి కప్పలు దీని ఆహారం. ఇంకేముంది.. పరిసరాల్లో దాక్కుని అవి రాగానే ఠక్కున వాటిపై దాడి చేస్తుంది. గబుక్కున నోట్లో పెట్టేసుకుని తినేస్తుంది. అంతేనా? పెద్ద పెద్ద జీవులు అదేనండీ దీని శత్రుజీవుల నుంచి తప్పించుకోవడానికీ ఇదే ఎత్తు వేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని