పొడుపు కథలు

ఒంటి కన్ను వాడు.. పరుగు పరుగున కంచె వేస్తాడు..

Published : 15 Aug 2020 00:27 IST

1. ఒంటి కన్ను వాడు.. పరుగు పరుగున కంచె వేస్తాడు.. ఎవరు?

2. అన్నదమ్ములు ముగ్గురు.. అలుపు లేకుండా తిరుగుతారు.

3. ఒంటి నాలుకవాడు.. ఆకాశంలో వేలాడతాడు.. నాలుక లాగితే ఠంగుమంటాడు.

4. దేశాలన్నీ చుట్టేస్తుంది.. కానీ దేశంలోకి వెళ్లలేదు.


తమాషా ప్రశ్న

తిరగలేని మర?

మనకు అర్థం కాకపోయినా భద్రంగా దాచుకునేది?

లారీడ్రైవర్‌ రెడ్‌ సిగ్నల్‌ పడినా ఆగలేదు. అయినా ట్రాఫిక్‌ పోలీసు ఏమీ అనలేదు. ఎందుకని?


క్విజ్‌ క్విజ్‌

1. గిర్‌ నేషనల్‌ పార్క్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

2. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎవరన్నారు?

3. భారతదేశంలోకెల్లా అతిపెద్ద పోస్టాఫీసు?

4. మన దేశంలో మొట్టమొదట సూర్యోదయం అయ్యే రాష్ట్రం?

5. థార్‌ ఎడారి గుండా ప్రవహించే ఏకైక నది?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండు సార్లు రాకూడదు.


గబగబా అనండి

Shy Shelly says she shall sew sheets shortly


దారేది?



జవాబులు:

పొడుపు కథలు: 1. సూది 2. ఫ్యాన్‌ 3. గంట 4. ఓడ

క్విజ్‌.. క్విజ్‌..: 1.గుజరాత్‌ 2. శ్రీకృష్ణ దేవరాయలు 3. ముంబై పోస్టాఫీసు 4. అరుణాచల్‌ ప్రదేశ్‌ 5. లూని నది

తమాషా ప్రశ్నలు: 1.పడమర 2. డాక్టర్‌ రాసిచ్చిన మందుల చీటీ 3. లారీడ్రైవర్‌ నడిచి వెళుతున్నాడు కాబట్టి

కవలలేవి?: 2, 4

మరిన్ని ఆసక్తికర కథనాలు https://epaper.eenadu.net/ లో


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని