కొడగు.. వీరికి గొడుగు!
హాయ్ ఫ్రెండ్స్.. మన కాలికి చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోతాం. అది మానిపోయే వరకూ మన దృష్టంతా దాని దగ్గరే ఉండిపోతుంది. మరి, అవయవ లోపంతో బాధపడే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అటువంటి పిల్లలను అక్కున చేర్చుకుంటూ, వారిలోని ప్రతిభను వెలుగులోకి తీసుకొస్తూ.. గొడుగులా తోడ్పాటునిస్తుందో పాఠశాల.
ఆ వివరాలే ఇవీ..
కర్ణాటక రాష్ట్రం మడికెరి సమీపంలో కొడగు అనే ఊరు ఒకటుంది. ఇక్కడి విద్యాలయంలో కేవలం ప్రత్యేక అవసరాలున్న పిల్లలకే చదువు చెబుతున్నారు. అంతేకాదు.. పాఠాలతోపాటు వారి ఆసక్తులకు అనుగుణంగా వివిధ రంగాల్లో ఉపాధి శిక్షణ ఇస్తున్నారు. ఆ విద్యార్థులు కూడా గురువులు, నిర్వాహకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు.
దాతల సహకారంతో..
1996లో కొందరు మానవతావాదులు బృందంగా ఏర్పడి, దివ్యాంగ పిల్లల కోసం ‘కొడగు విద్యాలయం’ స్థాపించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ వేలాది మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిందీ పాఠశాల. కేవలం ఆ ప్రాంత చిన్నారులు మాత్రమే కాకుండా జిల్లాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలనూ ఇక్కడ చేర్చుకుంటున్నారు. వారిలో అధిక శాతం పేద కుటుంబాల నుంచి వచ్చినవారే. దీనంతటికీ అయ్యే ఖర్చును దాతలు, స్వచ్ఛంద సంస్థలే సమకూరుస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తోంది. ప్రస్తుతం ఈ బడిలో 61 మంది చదువుకుంటున్నారు. వీరికి పాఠాలు చెప్పేందుకు 10 మంది నిపుణులైన ఉపాధ్యాయులను నియమించారు. అందులో కొందరు అక్కడే విద్య పూర్తి చేసిన వారూ ఉండటం విశేషం.
క్రీడలకు పెద్దపీట
రెండేళ్ల క్రితం ఓ ట్రస్టు అందించిన ఆర్థిక సాయంతో కొడగు విద్యాలయాన్ని ఆధునికీకరించారు. పిల్లలు బాగా చదువుకునేందుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. ఇక్కడ చదువుతోపాటు విద్యార్థుల ప్రతిభ ఆధారంగా కుట్లు, అల్లికలు, క్రీడలు, స్విమ్మింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ విద్యాలయ పిల్లలు పారా ఒలింపిక్స్‌తోపాటు పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటారట. కల్పనాథ్ అనే మొదటి బ్యాచ్ విద్యార్థి గతంలో అలస్కాలో ప్రత్యేక విద్యార్థులకు జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆయన ప్రస్తుతం ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తనలాంటి దివ్యాంగ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు.
అన్ని వసతులు..
ఈ విద్యాలయంలో అత్యాధునిక కిచెన్, ఫిజియోథెరపీ గది, ఆడియోలజీ యూనిట్, వొకేషనల్ కేంద్రం అందుబాటులో ఉంది. దివ్యాంగ విద్యార్థులు కుట్టిన దుస్తులు, బ్యాగులు తదితర ఉత్పత్తులను స్కూల్ ఆవరణలోనే విక్రయిస్తుంటారు. ఏడాదికోసారి సేల్ కూడా నిర్వహిస్తుంటారు. అలా సమకూరిన డబ్బులను మళ్లీ విద్యాలయ అభివృద్ధికే వినియోగిస్తుంటారు. నేస్తాలూ.. ఈ చిన్నారులతోపాటు నిర్వాహకులను మనమూ అభినందిద్దాం.!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Kamal Anand: రూ.60 కోసం పదేళ్లు పోరాటం
-
India News
Arvind Kejriwal: మోదీ విద్యార్హతపై అనుమానం పెరిగింది: కేజ్రీవాల్
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
India News
వెనుకా ముందు యువతులు.. బైక్పై ఆకతాయి చేష్టలు
-
Politics News
Ganta Srinivasa Rao: ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదు: గంటా
-
India News
వింత ఘటన.. ఉల్లి కోసేందుకు వెళితే కళ్లలోంచి కీటకాల ధార