తొందరపాటు ఫలితం!
ఒక కోతి దారి వెంట నడుస్తూ, పక్కనే ఉన్న మొక్కలను పీకేయసాగింది. ఎదురుగా వస్తున్న ఒక నక్క అది చూసి.. ‘ఏయ్ కోతీ.. ఇదేం అల్లరి పని. అందరూ మొక్కలు నాటుతుంటే.. నువ్వేంటి అడవిలోని వాటిని పీకేస్తున్నావు? నేను ఈ విషయం మృగరాజుకు చెబుతా’ అంది.
ఒక కోతి దారి వెంట నడుస్తూ, పక్కనే ఉన్న మొక్కలను పీకేయసాగింది. ఎదురుగా వస్తున్న ఒక నక్క అది చూసి.. ‘ఏయ్ కోతీ.. ఇదేం అల్లరి పని. అందరూ మొక్కలు నాటుతుంటే.. నువ్వేంటి అడవిలోని వాటిని పీకేస్తున్నావు? నేను ఈ విషయం మృగరాజుకు చెబుతా’ అంది. అప్పుడు కోతి.. ‘నా ఇష్టం.. చెప్పుకో.. నేను తప్పు చేస్తే భయపడాలి..’ అని గడుసుగా సమాధానమిచ్చింది. దాని మాటలకు నక్కకు కోపం వచ్చింది. పరుగున సింహం వద్దకు వెళ్లి కోతిపై ఫిర్యాదు చేసింది. అప్పుడు సింహం.. ‘కోతి కాకపోతే అల్లరి పనులు ఇంకెవరు చేస్తారు? కొన్ని కొన్ని చూసీచూడనట్లు వదిలేయాలి.. ఈ మాత్రం దానికే మందలించడం ఎందుకు?’ అంది. కొన్ని రోజులకు కోతి చెట్టు కొమ్మల పైకి ఎక్కి వాటిని విరవసాగింది. అది చూసిన నక్క ‘ఏయ్ కోతీ.. మొన్న నీ సంగతి సింహానికి చెబితే, నువ్వు అజ్ఞానివని సరిపెట్టింది. ఈరోజు ఈ కొమ్మలు విరిచావని మళ్లీ ఫిర్యాదు చేస్తా. నీ ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి’ అంది. అప్పుడు కోతి ‘చెప్పుకో.. నేనేం భయపడను లే.. నేను ఇంకా ఈ కొమ్మలన్నింటిని కూడా విరుస్తాను చూడు’ అంటూ ఆ మిగిలిన చెట్ల కొమ్మలనూ విరగ్గొట్టి దారి పక్కన వేయసాగింది.
అప్పుడు నక్క, పట్టలేని ఆగ్రహంతో మృగరాజు దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. అప్పుడు కూడా సింహం ‘అయ్యో నక్కా.. ఆ కోతి అల్లరిదైనా మంచి మనసున్నదని మిగిలిన జంతువులు చెబుతున్నాయి. కాబట్టి, ఏవో రెండు మూడు పనులను బట్టి అది చెడ్డదని ఎలా నిందించగలవు. నీకు దాంతో ఏమైనా శత్రుత్వం ఉందేమో! లేకుంటే ఆ చిరుజీవిపై నువ్వొక్కదానివే ఎందుకు ఫిర్యాదు చేస్తావు?’ అని ప్రశ్నించింది. అప్పుడు నక్క.. ‘అయ్యో మృగరాజా! నాకూ, దానికీ ఏ శత్రుత్వమూ లేదు. నా సంగతి మీకు తెలుసు కదా.. అందరితో స్నేహంగానే ఉంటాను. ఎవరైనా మంచిని ప్రోత్సహించాలి కానీ చెడును కాదు.. అందుకే అది చేసే చెడ్డ పనులను మీ దృష్టికి తీసుకొచ్చా’ అని వివరణ ఇచ్చుకుంది. దాని మాటలకు సింహం నవ్వి ఊరుకుంది.
మరికొన్ని రోజులకు.. చెట్లకున్న పండ్లను తెంపి కింద పడేయసాగింది కోతి. ఆ సమయంలో నక్క ఆ పక్కనే ఉంది. ఇంతలో ఒక తోడేలు అటువైపు రావడం చూసిన నక్క.. దాన్ని పిలిచింది. అది తోడేలుకు కోతి చేస్తున్న పనిని చూపిస్తూ ‘చూశావా.. కోతి ఏం చేస్తుందో.. నేను సింహానికి చెప్పినా అది పట్టించుకోవడం లేదు. దాని అల్లరిని నువ్వే ప్రత్యక్షంగా చూడు..’ అంటూ గతంలో చేసిన పనులనూ చెప్పింది. అప్పుడు తోడేలు.. ‘ఓ నక్క మామా.. ఇప్పుడు నేను దీనికి సాక్ష్యంగా ఉన్నాను. మనిద్దరం వెళ్లి ఈ కోతిపైన మృగరాజుకు ఫిర్యాదు చేద్దాం. సింహం వింటే సరి. లేకుంటే.. చెడ్డ పనులు చేసే వారిని సింహం ఏమీ అనడం లేదని మనం ప్రచారం చేద్దాం పద..’ అని ఆ రెండూ సింహం గుహ వైపు బయలుదేరాయి.
తోడేలు కూడా ఫిర్యాదు చేయడంతో.. సింహం దాని మాటలు నమ్మి, కోతిని పిలిపించింది. కోతితోపాటు దాని గురించి తెలిసిన ఎలుగుబంటి, కుందేలు, జింకలను కూడా సింహం పిలిపించింది. వెంటనే సింహం.. ‘ఓ కోతీ! నువ్వు ఈ అడవికి నష్టం కలిగిస్తున్నావని నక్క, తోడేలు ఫిర్యాదు చేశాయి. దీనికి నీ సంజాయిషీ ఏంటి?’ అని ప్రశ్నించింది. అప్పుడు కోతి ‘మృగరాజా! నేనేం చెడ్డ పనులు చెయ్యలేదు. ఇవే.. చిన్న చిన్న జంతువులను విచక్షణ లేకుండా చంపేస్తున్నాయి. ఎవరి తప్పులు వారికి కనిపించవు’ అంది. అప్పుడు నక్క ‘నువ్వు మొక్కలను పీకి పడేయలేదా..? అది చెడ్డ పని కాదా?’ అని అడిగింది. అప్పుడు కోతి.. ‘కానే కాదు మృగరాజా.. వైద్యానికి పనికొచ్చే మూలికలు అవి. అవసరం పడతాయని వాటిని తీసుకెళ్లి ఎలుగుబంటికి ఇద్దామని పీకేశాను.. జంతువుల చికిత్సకు ఉపయోగపడే పనే కదా..’ అంది. ‘మరి కొమ్మలను విరిచావుగా..?’ అని తిరిగి ప్రశ్నించింది నక్క. ‘అవును.. ఆ కొమ్మలకు చెద పట్టింది.. వాటిని అలాగే వదిలేస్తే చెట్టు మొత్తం వ్యాపిస్తాయి. అందుకే అలా చేశాను’ అని జవాబిచ్చింది కోతి. అప్పుడు తోడేలు.. ‘పండ్లను తెంపి కింద పడేసిన దానికి ఏం చెబుతావు మరి?’ అని నిలదీసింది.
‘అవును.. కొన్ని జీవులకు చెట్లు ఎక్కడం రాదు. అవి కిందపడిన పండ్లనే తింటుంటాయి. మన కడుపు మాత్రమే నిండితే సరిపోదు కదా.. అందుకే కొన్ని పండ్లను తెంపి కింద పడవేశాను. అది పరోపకారానికే తప్ప నా స్వార్థం కోసం కాదు’ అని కోతి అనడంతో నక్క, తోడేలు తెల్లమొహం వేశాయి. ‘మృగరాజా! కొందరు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇతరుల పనులను వేలెత్తి చూపుతారు. ముందూ వెనకా ఆలోచించకుండా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అసలు విషయం తెలుసుకోకుండా ఫిర్యాదు చేస్తారు. మీరు మొదట నక్క మాటలను నమ్మలేదు. కానీ, ఇది తన వెంట తోడేలును కూడా తీసుకొని వచ్చేసరికి నమ్మాల్సి వచ్చింది. మీరే కాదు.. మీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని అంది కోతి. అప్పుడు ఎలుగుబంటి, జింక.. ‘అవును.. ఈ కోతి మంచితనం గురించి మాకు తెలుసు. ఈ రెండే తొందరపడి దానిపై ఫిర్యాదు చేశాయి’ అన్నాయి. తప్పు తెలుసుకున్న నక్క, తోడేలు.. తమను మన్నించమని కోతిని, సింహాన్ని వేడుకున్నాయి. కోతిని అభినందించిన సింహం.. పెద్దమనసుతో నక్కను, తోడేలును క్షమించింది.
సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి
-
Ap-top-news News
Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ
-
Ts-top-news News
Dharani portal: ధరణిలో ఊరినే మాయం చేశారు