పండుగ ప్రత్యేకతలు

ధనుర్మాసంలో నెలరోజులూ రోజు కొక్క పాశురం రచించిన గోదాదేవి , శ్రీరంగనాథుణ్ణి వివాహమాడిన రోజు భోగి....

Published : 09 Jan 2020 00:06 IST

‘భోగి’ భాగ్యాలు

14న

ధనుర్మాసంలో నెలరోజులూ రోజు కొక్క పాశురం రచించిన గోదాదేవి , శ్రీరంగనాథుణ్ణి వివాహమాడిన రోజు భోగి. ఇంతకు మించిన భోగమేముంది?. ఒక భక్తురాలు అలాంటి భోగాన్ని పొందిన రోజు భోగి పండగగా నిర్వహించుకుంటున్నాం. ఆరోజు అభ్యంగన స్నానం, నూతనవస్త్ర ధారణ, శ్రీమహావిష్ణువు అర్చన నిర్వహిస్తారు. ఆ సాయంత్రం పిల్లలకు తల్లులు తలలపై రేగు పండ్లను భోగిపండ్లుగా పోస్తారు.

ఉత్తరాయణంలోకి..

15న

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పటి నుంచి మకర మాసం. ఆ నెలలో మొదటిరోజు మకర సంక్రాంతి. నాటి నుంచి సూర్యుడు ఉత్తరదిక్కుగా ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అందువల్ల నాడు సూర్య దేవతారాధన, పితృదేవతల పేరుతో కూష్మాండ దానం చేయాలని పెద్దలు చెబుతారు.

కనుమ

16న

కనుమ పండగ. ఇది పశు సంతతిని గౌరవించే రోజు. మనది వ్యావసాయిక దేశం. పాడికి, పంటకు అభివృద్ధికీ మూలకారణమైన గోవులను, ఎద్దులను పూజించటం మన సంస్కృతిలో భాగం. అలా పూజించి గోసంతతి దీవెనలు అందుకునే పండగ కనుమ. ముక్కనుమ నాడు కూడా ఇలాగే పూజిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని