యాత్ర చేయొచ్చు... కానీ!

ఎవరైనా కాలం చేసినప్పుడు వారి ఇంట్లో వాళ్లకు, దాయాదులకు పది రోజులు సూతకం ఉంటుంది. దహన సంస్కారాలు నిర్వహించిన కర్తకు సంవత్సర సూతకం ఉంటుంది. 12వ రోజు దాటిన తర్వాత కర్త దేవాలయాలకు వెళ్లొచ్చు.

Published : 12 Mar 2020 00:30 IST

ధర్మ సందేహం

సంవత్సర సూతకం ఉన్నవాళ్లు తీర్థయాత్రలు చేయొచ్చా? - మురళీ, హైదరాబాద్‌
వరైనా కాలం చేసినప్పుడు వారి ఇంట్లో వాళ్లకు, దాయాదులకు పది రోజులు సూతకం ఉంటుంది. దహన సంస్కారాలు నిర్వహించిన కర్తకు సంవత్సర సూతకం ఉంటుంది. 12వ రోజు దాటిన తర్వాత కర్త దేవాలయాలకు వెళ్లొచ్చు. క్షేత్రాలకు వెళ్లడం, అక్కడ కొలువుదీరిన దైవాన్ని దర్శించడానికీ ఏ అభ్యంతరమూ లేదు. పిండ ప్రదానాలకు, అస్థికల నిమజ్జనాదులకు కాశీ ప్రయాగాది క్షేత్రాలకు సంవత్సరం లోపుగానే వెళ్లే సంప్రదాయం ఉంది. అయితే, ఏడాది లోపు ఏ క్షేత్రానికి వెళ్లినా కర్త తమ గోత్రనామాలతో అర్చన, అభిషేకాదులు చేయించడంపై నిషేధం ఉంది. ప్రముఖ క్షేత్రాలకు వెళ్లినా అర్చనాదులు చేసుకునే అవకాశం లేకపోవడంతో.. చాలామంది ఈ సంవత్సర కాలపరిమితిలో ఎలాంటి తీర్థయాత్రలు చేయడానికి ఆసక్తి చూపరు. అంతేగానీ, తీర్థయాత్రలు, సాధారణ దర్శనాదులకు ఎలాంటి అభ్యంతరం లేదు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని