నాయకుడు ఎలా ఉండాలంటే?

ఒక కుటుంబాన్నో, సంఘాన్నో ముందుకు నడిపే నాయకుడు ఎలా ఉండాలి?తన సహచరులతో, అనుచరులతో ఎలా మెలగాలి?

Published : 12 Mar 2020 00:33 IST

క్రీస్తువాణి

ఒక కుటుంబాన్నో, సంఘాన్నో ముందుకు నడిపే నాయకుడు ఎలా ఉండాలి?
తన సహచరులతో, అనుచరులతో ఎలా మెలగాలి?
వీటికి సమాధానం ప్రభువు ఉపదేశంలో కనిపిస్తుంది. ఒక మంచి యజమాని, మంచి గొర్రెల కాపరిలా ఉండాలంటారాయన.

‘ద్వారంలో నుంచి లోపలకు ప్రవేశించిన కాపరి స్వరం గొర్రెలు వింటాయి. అతను తన జీవాలన్నిటినీ పేరు పెట్టి పిలుస్తాడు. వాటిని నడిపించేటప్పుడు ముందు తానే ఉంటాడు. అవన్నీఅతని స్వరం విని అతన్ని అనుసరిస్తాయి. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. మందలో ఒక్కటి తప్పిపోయినా నిద్రాహారాలు మాని వెదుకుతాడు. అది దొరికినప్పుడు దాన్ని భుజాన వేసుకుని ఆనందంగా ఆ శుభవార్తను అందరికీ చెబుతాడు’... నిజమైన నాయకుడు కూడా తన అనుచరులతో ఇలాగే ఉంటాడు.

- ఎం.సుగుణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని