...అలా ఉంటాయి ప్రాణాలు!

తరగల్‌ పిప్పల పత్రముల్‌ మెరగు టద్దంబుల్‌ మరుద్దీపముల్‌కరికర్ణాంతము లెండమావుల తతుల్‌ ఖద్యోత కీటప్రభల్‌...

Published : 30 Apr 2020 00:04 IST

శ్రీకాళహస్తీశ్వరా!

తరగల్‌ పిప్పల పత్రముల్‌ మెరగు టద్దంబుల్‌ మరుద్దీపముల్‌

కరికర్ణాంతము లెండమావుల తతుల్‌ ఖద్యోత కీటప్రభల్‌

సురవీథి లిఖితాక్షరంబు లసువుల్‌ జ్యోత్న్యాపయః పిండముల్‌

సిరులందేల మదాంధులౌదురు జనుల్‌, శ్రీకాళహస్తీశ్వరా!

నీటి అలలు, మెరుపులతో చేసిన అద్దాలు, గాలిలో పెట్టిన దీపాలు, ఎండమావులు, మిణుగురు పురుగుల మెరుపులు, ఆకాశంలో రాసిన అక్షరాలు... ఇవన్నీ క్షణికాలు, చంచలాలు. మనిషి ప్రాణాలు కూడా అలాంటివే. ఇక సంపదలు మంచునీటి బిందువుల్లాంటివి. ఎప్పుడు కరిగిపోతాయో, తరిగిపోతాయో తెలియదు. మనుషులు కూడా విషయ వాంఛల్లో మునిగి కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారు. వయసు మీద పడ్డా, మనలో చాలామందికి ఈ భ్రమలు తొలగకపోవడం బాధాకరం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని