అక్షరం అమ్మగా మారి...

కాలం దైవాధీనం... దైవం మంత్రాధీనం అంటారు. భగవత్‌ శక్తి అంతా మంత్రాల్లో నిక్షిప్తమై ఉందని కుర్తాళం పీఠాధిపతి...

Updated : 22 Oct 2020 01:02 IST

కాలం దైవాధీనం... దైవం మంత్రాధీనం అంటారు. భగవత్‌ శక్తి అంతా మంత్రాల్లో నిక్షిప్తమై ఉందని కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ తీర్థస్వామి తన మంత్రసాధనలు అనే పుస్తకంలో విశదీకరించారు. ఇందులో బీజాక్షరాలకు విశేష ప్రాధాన్యం ఉంది. మంత్రాలను  బీజాక్షరాలతో సంపుటీకరించి పలికినప్పుడు అద్భుతమైన శక్తి పుడుతుందని చెప్పారు. వామకేశ్వర తంత్రంలో శ్రీ విద్యా సంబంధమైన మంత్రాలున్నాయి. ఇందులోని షోడశాక్షరీ మంత్ర విశ్లేషణలో బీజాక్షరాల వివరణ కనిపిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః అనే బీజాక్షరాలను శాక్తేయ ప్రణాలు అంటారు. అవి జగన్మాత శక్తిని వెల్లడిస్తాయి.

ఈ బీజాక్షరంలోని శ వర్ణానికి శుభం, ఆనందం అనే అర్థాలున్నాయి. సకల శుభప్రదమైందిది.


దీన్ని మాయా బీజాక్షరంగా చెబుతారు. అవ్యక్తమైన జగత్కారిణికి ఇది ప్రతిబింబం. దధీచి సంహితలో దీనికి సంబంధించిన వివరణ కనిపిస్తుంది.


దీన్ని కామ బీజం అంటారు. సాధకుడి కోర్కెలు తీరేందుకు ఈ బీజాక్షరంతో కూడిన మంత్రజపం ఉంపయోగపడుతుందని చెబుతారు.

ఇది సరస్వతీ వాక్బీజం. విద్య కోరుకునేవారు ఈ బీజాక్షరంతో మంత్ర సాధన చేయాలని నిర్దేశించారు. తద్వారా సరస్వతీ మాత అనుగ్రహాన్ని పొందవచ్చు.


ఈ బీజాక్షరం అర్ధనారీశ్వరాత్మకం. దీన్ని సౌభాగ్య బీజం అని కూడా అంటారు.

మరిన్ని కథనాల కోసం https://epaper. eenadu.net/ లో.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని