తనువంతా రామమయం!

రామకోటి ఎక్కడ రాస్తారు? పుస్తకాలు, తాళపత్రాలపై అని ఠక్కున చెప్పేస్తాం. కానీ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని ఓ తెగ వారు తమ దేహాన్ని రాముడికి అంకితమిచ్చి తమ శరీరం మీద రామకోటి రాసుకుని

Updated : 21 Jan 2021 01:54 IST

రామకోటి ఎక్కడ రాస్తారు? పుస్తకాలు, తాళపత్రాలపై అని ఠక్కున చెప్పేస్తాం. కానీ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని ఓ తెగ వారు తమ దేహాన్ని రాముడికి అంకితమిచ్చి తమ శరీరం మీద రామకోటి రాసుకుని తరిస్తున్నారు. వారిని రామనామి తెగ అని పిలుస్తారు. ఈ తెగ వారు ఏటా మూడు రోజుల పాటు మేళా నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటంటే...
ఛత్తీస్‌గఢ్‌ జిల్లాలోని జంజీర్‌ చపా, సారంగఢ్‌ జిల్లాలో రామ్‌నామి అనే తెగ ప్రజలు కనిపిస్తారు. వీరికి శ్రీరాముడంటే అమితమైన భక్తి. గతంలో వీరికి దేవాలయాల్లో ప్రవేశం లేక పోవడం వల్ల వారి దేహాన్నే రామాలయంగా భావించడం మొదలుపెట్టారు. శరీరం మొత్తం శ్రీరామ అనే పచ్చబొట్లు వేయించుకున్నారు. వీరు  పూర్తిగా శాకాహారులు. రోజూ రామాయణం పారాయణ చేస్తారు. వీరింట శుభకార్యమైనా, అశుభం జరిగినా శ్రీరాముని భజన చేస్తారు. ఏటా పుష్యమాసం శుక్ల ఏకాదశి రోజు మూడు రోజుల పాటు మేళా నిర్వహిస్తారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో సారంగఢ్‌ జిల్లా నాందిలిలో దీనికి ఏర్పాట్లు చేసుకున్నారు. దీవికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తారు.

-ఉదయ్‌కుమార్‌, మాచ్‌ఖండ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని