మితిమీరిన సంపద మేలుచేయదు!

ఇవ్వడంలో ఆనందం ఉండాలి. దానం చేసేటప్పుడు మనం సంతోషపడాలి. అదే మేలైన దానం. ‘బలవంతంగా కాక, ప్రతివారూ తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి’... ఇది ప్రభువు వాక్కు.. కొంచెంగా విత్తేవాడు కొంచెమే పంట తీసుకుంటాడు.

Published : 11 Feb 2021 01:42 IST

క్రీస్తువాణి

ఇవ్వడంలో ఆనందం ఉండాలి. దానం చేసేటప్పుడు మనం సంతోషపడాలి. అదే మేలైన దానం. ‘బలవంతంగా కాక, ప్రతివారూ తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి’... ఇది ప్రభువు వాక్కు.. కొంచెంగా విత్తేవాడు కొంచెమే పంట తీసుకుంటాడు. సమృద్ధిగా విత్తేవాడు పెద్దఎత్తున పంట తీసుకుంటాడు. అలాగే ఎంత ఎక్కువగా పరోపకారం చేస్తే అంతే ప్రతిఫలం దొరుకుతుంది అంటారు ప్రభువు.. యెరూషలేం దేవాలయంలో కానుకల పెట్టెలో తనకు ఉన్నదంతా వేసిన ఓ వృద్ధురాలి దాతృత్వాన్ని ఆయన  మెచ్చుకున్నాడు. మన అవసరాల కోసం ధనం సంపాదించుకోవాలి. అలాగే అవసరంలో ఉన్న వేరొకరికి తప్పకుండా సాయం చేయాలి.. మితిమీరిన సంపద వృధాగా నశించిపోతుంది. దీనులను, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు వచ్చే పుణ్యఫలం సర్వదా నిలిచి ఉంటుందని బైబిల్‌ మనకు బోధిస్తుంది.

-సుగుణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని