మీ ఉపవాస దీక్ష ప్రభువు చూస్తున్నారు!

ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని అర్థం. ఈస్టర్‌ పర్వదినానికి నలభై రోజుల ముందు నుంచి ప్రారంభమయ్యే

Published : 04 Mar 2021 00:18 IST

క్రీస్తువాణి

ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని అర్థం. ఈస్టర్‌ పర్వదినానికి నలభై రోజుల ముందు నుంచి ప్రారంభమయ్యే లెంట్‌ దినాలు ఉపవాస ప్రాధాన్యాన్ని చాటుతాయి. లోక పాప పరిహారార్థం ప్రభువు సిలువపై బలియాగానికి గుర్తుగా ఈ రోజుల్లో క్రైస్తవులు ఉపవాస దీక్షలో పాల్గొంటారు. తద్వారా శరీరాన్ని, మనసును పరిశుద్ధం చేసుకోవాలన్నది క్రీస్తు సందేశం. ఉపవాసం ఉన్న రోజుల్లో  ఏమీ తినకున్నా తాము వండిన ఆహారంతో పేదల ఆకలి తీర్చాలి.  ‘ఉపవాసం ఉన్న విషయం అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పరలోక ప్రభువు చూస్తున్నాడని గుర్తుంచుకోండి’ అంటారు ప్రభువు. ఆయన స్వయంగా నలభై రోజులు ఉపవాస దీక్ష చేశారు. మానవాళికి మహోన్నత మార్గం చూపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని