తరలి వస్తోంది రంజాన్‌ వసంతం!

రంజాన్‌కు రెండు నెలల ముందుగా వచ్చేది రజబ్‌ మాసం. దీన్నే ప్రవక్త (స) ‘అల్లాహ్‌ నెల’ అని ప్రకటించారు.  పవిత్ర రంజాన్‌ కోసం

Published : 04 Mar 2021 00:20 IST

ఇస్లాం సందేశం

రంజాన్‌కు రెండు నెలల ముందుగా వచ్చేది రజబ్‌ మాసం. దీన్నే ప్రవక్త (స) ‘అల్లాహ్‌ నెల’ అని ప్రకటించారు.  పవిత్ర రంజాన్‌ కోసం ఆయన ఈ నెలనుంచే మానసికంగా సన్నద్దులయ్యేవారు. రజబ్‌ నెలవంకను చూడగానే ‘‘ఓ అల్లాహ్‌ మాకోసం రజబ్‌, షాబాన్‌ మాసాల్లో శుభాలు చేకూర్చు. మమ్మల్ని రంజాన్‌ పర్వదినానికి చేర్చు’’ అని వేడుకునేవారు;  ‘రజబ్‌ నెల చల్లని గాలుల వంటిది. ఈ నెల తరువాత వచ్చే షాభాన్‌ మేఘాల వంటిది. ఆ తరువాత వచ్చే రంజాన్‌ వర్షపు చినుకుల వంటిది’ అంటారు హజ్రత్‌ అబూబకర్‌ (రజి). ‘రజబ్‌ మాసంలో విత్తు విత్తి షాబాన్‌ నెలలో నీళ్లు పోసి పెంచితే రంజాన్‌లో ఫలాలు కాస్తాయి’ అంటారు ఉలమాలు. అందుకే ఈ నెలలో మంచి పనులకు శ్రీకారం చుట్టాలి.

- ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని