తఖ్వా తప్పరుగా..!

మనం నడిచే దారిలో చుట్టూ ముళ్ల కంపలున్నాయనుకోండి. మార్గమంతా ఏపుగా దట్టంగా పెరిగిన గడ్డితో కాలుతీసి కాలు ,...

Published : 08 Apr 2021 00:48 IST

ఇస్లాం సందేశం

నం నడిచే దారిలో చుట్టూ ముళ్ల కంపలున్నాయనుకోండి. మార్గమంతా ఏపుగా దట్టంగా పెరిగిన గడ్డితో కాలుతీసి కాలు వేయాలంటేనే వణుకుపుడుతుందనుకోండి. అలాంటి మార్గంలో నడిచేవారు ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతారు. ఇలా వెళ్లడమే తఖ్వా అని ఉబై ఇబ్నె కాబ్‌ చెప్పారు. ‘తఖ్వా’ అంటే ఏమిటి? అని హజ్రత్‌ ఉమర్‌ (రజి) అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన ఉపమానం ఇది. తఖ్వా అంటే నిఘంటువు ప్రకారం తన్ను తాను కాపాడుకోవడం అని అర్థం. ఖురాన్‌ పరిభాషలోనైతే చెడుపనులను త్యజించి మంచి చేయడమే తఖ్వా. మనిషి జీవితం ఓ ప్రయాణం లాంటిది. మంచిమార్గాన్ని అలవర్చుకునే ప్రయాణికుడు గమ్యస్థానానికి క్షేమంగా చేరుకుంటాడని ప్రవక్త (స) చెప్పారు. .తఖ్వా అనే భవనం నాలుగు స్తంభాలపై నిలబడి ఉంది. అందులో అల్లాహ్‌పై భయభక్తులతో ఉండడం,  ఖురాన్‌ బోధనలు తుచ తప్పకుండా అనుసరించడం,  జీవితంలో మనకు లభించిన అనుగ్రహాలకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలపడం,  చనిపోయాక ప్రపంచంలో నేను గడిపిన ఒక్కో ఘడియ గురించి లెక్కచెప్పాలి అన్న ఎరుకతో ఉండడం... ఈనాలుగు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. దీనివల్ల మనిషి సత్ప్రవర్తనతో ఉంటాడు. దాని వల్ల వ్యక్తిగతమైన శాంతి, సమాజ శాంతి కూడా సాధ్యమవుతాయి.

-ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని