ఉపవాసం ఉదరానికా?

ఆకాశంలో నెలవంక మెరవగానే ముస్లింలు రంజాన్‌ ఉపవాసాలకు శ్రీకారం చుడతారు. ఈ ఉపవాసాలను రోజాలంటారు. తుచ తప్పకుండా ఉపవాసాలు చేయడం వెనక ఉన్న పరమార్థమేంటి?

Published : 15 Apr 2021 00:51 IST

రంజాన్‌ సందేశం

ఆకాశంలో నెలవంక మెరవగానే ముస్లింలు రంజాన్‌ ఉపవాసాలకు శ్రీకారం చుడతారు. ఈ ఉపవాసాలను రోజాలంటారు. తుచ తప్పకుండా ఉపవాసాలు చేయడం వెనక ఉన్న పరమార్థమేంటి?
అరబీలో ఉపవాసాన్ని సౌమ్‌ అంటారు. అరబ్బులు ఆ కాలంలో యుద్ధాలకోసం వాడే గుర్రాలను కొన్ని రోజుల పాటు పస్తులుంచి వాటికి శిక్షణనిచ్చేవారు. ఈ విధానాన్ని సౌమ్‌ అనేవారు. ప్రయాణంలో ఉన్నప్పుడు, యుద్ధాలలో వాటికి తిండి, నీరు అందకపోయినా అవి బెంబేలెత్తకుండా ఉండేందుకు అరబ్బులు ఇలా చేసేవారు. ఇలా శిక్షణ తీసుకున్న గుర్రాలు మెరుపువేగంతో పరుగెత్తేవి. యుద్ధాల్లోనూ చురుగ్గా పాల్గొనేవి. రోజా ఉద్దేశమూ ఇలాంటిదే. అల్లాహ్‌ ఆజ్ఞలను ఉల్లఘించకుండా తనను తాను కాపాడుకునేందుకే ఉపవాసాలను విధించింది ఇస్లామ్‌. దైనందిన జీవితంలో మనిషికి మనసు కోరిందల్లా చేయాలనిపిస్తుంది. చూసిందల్లా తినాలనిపిస్తుంది. ఖురాన్‌ ప్రకారం మనిషి దేవుని ప్రతినిధి. ఒక విశ్వాసికి ఈ ప్రపంచం కారాగారం వంటిదన్నారు ప్రవక్త (స). ఏది తినాలి? ఏమి తినకూడదు? ఎలా సంపాదించాలి? దేనికి ఖర్చు చేయాలి? అన్న విషయాలను ఖురాన్‌ స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు ఏడాది మొత్తం దైవాజ్ఞలకు అనుగుణంగా జీవితాన్ని గడిపేందుకు ఇచ్చే నెల రోజుల శిక్షణే రంజాన్‌.

- ఖైరున్నీసాబేగం

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని