ఆ మనసుండాలి...

కురుక్షేత్ర యుద్ధం దాదాపు తుది అంకానికి చేరుకుంది. కర్ణుడు మృత్యువు అంచున ఉన్నాడు. అయితే, చేసిన దాన ధర్మాలు మరణాన్ని అతని దగ్గరికి రానివ్వటం లేదు. అది గ్రహించిన కృష్ణుడు కర్ణుడి దగ్గరికి

Updated : 05 Aug 2021 04:45 IST

కురుక్షేత్ర యుద్ధం దాదాపు తుది అంకానికి చేరుకుంది. కర్ణుడు మృత్యువు అంచున ఉన్నాడు. అయితే, చేసిన దాన ధర్మాలు మరణాన్ని అతని దగ్గరికి రానివ్వటం లేదు. అది గ్రహించిన కృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్లి, ‘కర్ణా! నువ్వు ఇన్నాళ్లూ దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు ఇవ్వవా?’ అనడిగాడు. రాధేయుడు ఆనందంగా ఇచ్చేశాడు. దానికి కృష్ణుడు ఎంతో సంతోషించి, ‘నీకో వరమిస్తాను. ఏం కావాలో అడుగు’ అన్నాడు.

దానికి కర్ణుడు, ‘నాకు ఇంకో జన్మ వద్దు. ఒకవేళ ఉంటే, అప్పుడు కూడా ఎవరేం అడిగినా లేదని చెప్పకుండా సాయం చేసే హృదయాన్నివ్వు’ అనడిగాడు. ఆ మాటకి కన్నయ్య నయనాలు సజలమయ్యాయి. ఉద్వేగంతో కర్ణుడిని తన హృదయానికి హత్తుకున్నాడు. మోక్షం కోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ముక్తి కోసం దైవదర్శనాలు అంటూ తిరగక్కరలేదు. నలుగురికీ చేతనైనంత సాయం చేసే మంచి మనసుంటే చాలు. ఆ భగవంతుడే దిగొచ్చి ఆప్యాయంగా తన గుండెలకు హత్తుకుంటాడు.

- శేషుకుమారి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని