ఇది అల్లాహ్‌ నెల

ఇస్లామిక్‌ నెలల్లో మొదటిది ముహర్రమ్‌. ఇదెంతో విశిష్టమైంది. ఈ నెల పవిత్రత దృష్ట్యా యుద్ధాలను తర్వాతి నెలలకు వాయిదా వేసేవారు. ‘రమజాన్‌ నెల ఉపవాసాల తర్వాత ముహర్రమ్‌ నెల ఉపవాసాలు

Updated : 19 Aug 2021 01:50 IST

ఆగస్టు 20 ముహర్రమ్‌

స్లామిక్‌ నెలల్లో మొదటిది ముహర్రమ్‌. ఇదెంతో విశిష్టమైంది. ఈ నెల పవిత్రత దృష్ట్యా యుద్ధాలను తర్వాతి నెలలకు వాయిదా వేసేవారు. ‘రమజాన్‌ నెల ఉపవాసాల తర్వాత ముహర్రమ్‌ నెల ఉపవాసాలు ప్రముఖమైనవి’ అన్నారు మహా ప్రవక్త. ఈ ఉపవాసాలెంతో శ్రేష్ఠమైనవి.. ఒక సహచరుడు ‘రమజాన్‌ నెలతో పాటు వేరే ఏ నెలలో ఉపవాసాలు పాటించాలి?’ అనడిగాడు. దానికి ప్రవక్త (స) ముహర్రమ్‌ నెలను సూచించి, ‘యౌమె ఆషూరా ఉపవాసం పాటించడంవల్ల గత ఏడాది చేసిన పాపాలన్నీ హరిస్తాయి’ అంటూ సెలవిచ్చారు ముహర్రమ్‌ నెల పదో తేదీని ‘ఆషూరా’ అంటారు. ఈ పదం ‘అష్ర్‌’ నుంచి వచ్చింది. అంటే  పది అని అర్థం.

దైవప్రవక్త (స) ఆషూరా రోజున ఉపవసించడం అలవాటు చేసుకోమని ఆదేశించారు. ఇస్లామ్‌ విద్వాంసులు ఆషూరా రోజుతోపాటు దానికి ముందురోజు లేదా తర్వాతి రోజు కూడా ఉపవాసాలు పాటించమన్నారు. దైవప్రవక్తలకు, యౌమె ఆషూరాకు అవినాభావ సంబంధం ఉంది. చరిత్రలో యౌమె ఆషూరా రోజున ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇస్లాం చరిత్రలో ఎంతో పవిత్రత ప్రాధాన్యత ఉన్న ఈ రోజునే హజ్రత్‌ ఇమామె హుసైన(రజి) అమరగతి పొందడం యాదృచ్ఛికం. ఈయన పరివారమంతా ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి అమరులయ్యారు. దుర్మార్గాలు, దౌర్జన్యాలపై రాజీలేని పోరాటం చేయాలని కర్బలా ఘటన తెలియజేస్తుంది.

- ముహమ్మద్‌ ముజాహిద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు