చదువులస్వామికి ప్రణామం

శ్రావణ పౌర్ణమిని విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవ జయంతిగా జరుపుకుంటాం. వివేకాన్ని, విజ్ఞానాన్నీ ఇచ్చే దేవుడు హయగ్రీవుడు. మానవ శరీరానికి గుర్రపు తల ఉన్న హయగ్రీవుని హయశీర్ష అని కూడా

Updated : 19 Aug 2021 01:47 IST

ఆగస్టు 22 హయగ్రీవ జయంతి

శ్రావణ పౌర్ణమిని విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవ జయంతిగా జరుపుకుంటాం. వివేకాన్ని, విజ్ఞానాన్నీ ఇచ్చే దేవుడు హయగ్రీవుడు. మానవ శరీరానికి గుర్రపు తల ఉన్న హయగ్రీవుని హయశీర్ష అని కూడా అంటారు. హిందూపురం, మచిలీపట్నాల్లో ఈ స్వామికి ఆలయాలున్నాయి. వైష్ణవ సంప్రదాయంలో హయగ్రీవునికి ప్రముఖ స్థానముంది. పై రెండు చేతుల్లో శంఖచక్రాలు ధరించగా, కింది కుడిచేతిలో అక్షరమాల, ఎడమచేతిలో పుస్తకం ఉంటాయి. చదువులతల్లి సరస్వతిలా హయగ్రీవుడు చదువులస్వామి.


ఓం అక్షరేశ్వరాయ విద్మహే
హయగ్రీవాయ ధీమహే
తన్నో హయగ్రీవ ప్రచోదయాత్‌

అంటూ హయగ్రీవుని స్మరిస్తే చదువుకు ఎలాంటి ఆటంకం ఉండదని నమ్మకం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు