ధ్యానం - పిల్లి

‘గురువుగారూ నాదో సందేహం. ఆధ్యాత్మికవేత్తలు గొప్ప బోధలే చేస్తారు కదా! అయినా కొందరిలో ఛాందస భావాలు ఎందుకుంటాయి?’ అనడిగాడు శిష్యుడు.

Updated : 23 Sep 2021 05:50 IST

‘గురువుగారూ నాదో సందేహం. ఆధ్యాత్మికవేత్తలు గొప్ప బోధలే చేస్తారు కదా! అయినా కొందరిలో ఛాందస భావాలు ఎందుకుంటాయి?’ అనడిగాడు శిష్యుడు.

‘ఓ ఉదాహరణ చెబుతాను.. పూర్వం ఒక శిష్యబృందం ధ్యానం చేస్తుండగా ఆశ్రమంలో పిల్లి వారి మధ్యకొచ్చి అటూ ఇటూ తిరుగుతూ వాళ్ల మీదికి ఎక్కసాగింది. దాంతో ధ్యానం మీద మనసు లగ్నం కాలేదు. ఎంత అదిలించినా పిల్లి వెళ్లకపోవడంతో ‘ధ్యానం చేసే సమయానికి ఆ పిల్లిని గదిలో పెట్టి తలుపేయండి’ అన్నారు గురువుగారు. అప్పటి నుంచి శిష్యులు అలాగే చేశారు. ధ్యాన సమయంలో పిల్లి దూరంగా ఎక్కడో ఉన్నా మధ్యలో వచ్చేస్తుందేమోనని గదిలో పెట్టేవాళ్లు. కొన్నాళ్లకి గురువుగారు చనిపోయారు. ఇంకొన్నాళ్లకి ఆ పిల్లి కూడా మరణించింది. శిష్యులు మాత్రం ధ్యానం వేళ ఇంకో పిల్లిని తెచ్చి మరీ గదిలో పెట్టి తలుపేసేవారు. అర్థమైంది కదా! ఎందుకో, ఏమిటో వివరాలు తెలుసుకోకుండా గుడ్డిగా అనుసరించే అలవాట్లు అలా మూఢాచారాల్లా ఛాందస భావాల్లా నిలిచిపోతాయి’ అంటూ చెప్పారు జెన్‌ గురువు.

- లేఖ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని